IPL 2021: ఐపీల్ లో మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ..మే 29న షెడ్యూల్ ప్రకటించే అవకాశం!

IPL 2021: ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక పరిష్కారాన్ని కనుగొంది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యుఎఇలో జరుగుతాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

IPL 2021: ఐపీల్ లో మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ..మే 29న షెడ్యూల్ ప్రకటించే అవకాశం!
Ipl 2021
Follow us
KVD Varma

|

Updated on: May 23, 2021 | 3:12 PM

IPL 2021: ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక పరిష్కారాన్ని కనుగొంది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యుఎఇలో జరుగుతాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్‌ల కోసం బోర్డు రెండు వేదికలను పరిశీలిస్తోంది. ఇంగ్లాండ్ అలాగే యూఏఈ రెండిటిలో ఒక చోట ఐపీఎల్ నిర్వహించాలని భావించింది. అయితే, యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు చెబుతున్నారు. భారత్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 టోర్నీ 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ లు ఉన్నాయి. వీటిలో 31 మ్యాచ్‌లు ఇంకా జరగలేదు. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా ఐపీఎల్ యూఏఈలో నిర్వహించారు. దీంతో ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను కూడా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 29 వ తేదీన టోర్నమెంట్ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారు. క్రికెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఆరోజు జరుగుతుంది. అదేరోజు ఐపీఎల్ తదుపరి మ్యాచ్ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ఆ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్టు 4 నుండి యూకేలో ఇంగ్లాండ్ టీమిండియా మధ్య 5 టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ లో రెండో టెస్ట్ కు మూడో టెస్ట్ కు మధ్యలో 9 రోజుల గ్యాప్ ఉంది. ఈ అంతరాన్ని 4 రోజులకు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది బోర్డు. అలా అయితే, ఐపీఎల్ (IPL 2021) నిర్వహణకు ఇంకొన్ని రోజులు ఎక్కువ లభిస్తాయని భావిస్తున్నారు. ఈ అంశంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమాంగ్ అమిన్ ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మూడు కారణాలను ఆయన పెర్కొంతున్నట్టు తెలుస్తోంది.

తక్కువ ఖర్చు: యూఏఈలో ఐపీఎల్ జరపాలని అనుకోవడానికి మొదటి కారణం ఇంగ్లాండ్ కంటే యూఏఈలో దీనికి తక్కువ ఖర్చు అవుతుంది. ఇంగ్లాండ్‌లోని హోటళ్ళు, స్టేడియాలు మొదలైన వాటికి యూఏఈ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. యూఏఈలోని జట్లు రోడ్డు మార్గం ద్వారా స్టేడియానికి సులభంగా చేరుకోవచ్చు అందువల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి అంతేకాకుండా సమయమూ ఆదా అవుతుంది. ప్రయాణ ఖర్చులు ఇంగ్లాండ్‌లో ఎక్కువగా అవుతాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే అధిక ప్రయాణం కరోనా సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

వాతావరణం: ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు యుకెలో నిర్వహించాకూడదు అనుకోవడానికి రెండవ కారణం సెప్టెంబర్‌లో అనిశ్చిత ఇంగ్లాండ్ వాతావరణం. అక్కడ ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం ఎక్కువ. దీంతో వర్షం కారణంగా చాలా మ్యాచ్‌లు రద్దు చేయాల్సి ఉంటుంది. అదే యూఏఈలో అయితే, సెప్టెంబర్‌లో చల్లని వాతావరణం ఉంటుంది. ఇది ఆటగాళ్లకు అలాగే సిబ్బందికి అనుకూలంగా ఉంటుంది.

యూఏఈ అనుభవం: IPL 2021 : ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు యూఏఈ మొదటి ఎంపిక కావడానికి మూడవ కారణం టోర్నమెంట్‌ను గతంలో అక్కడ నిర్వహించిన అనుభవం. ఐపీఎల్ గత సీజన్ యూఏఈలోనే జరిగింది. అటువంటి పరిస్థితిలో, అక్కడ ఎదురయ్యే సవాళ్ళ గురించిఅందరికీ అంచనా ఉంది. ఇంగ్లాండ్‌లో ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగలేదు. అందువల్ల అక్కడ ఉన్న సవాళ్లు తెలియవు. అదే సమయంలో, కరోనా కారణంగా, వివిధ నగరాల ప్రోటోకాల్స్.. అక్కడ పరిమితులు తెలియవు. కరోనా మధ్య ఐపీఎల్ కారణంగా యూఏఈలో ఉండే మూడు నగరాల్లో విధించిన ప్రోటోకాల్, ఆంక్షల గురించి ఆటగాళ్ళతో సహా అందరికీ తెలుసు. ఈ నేపధ్యంలో ఇక్కడ నిర్వహించడానికి పెద్దగా సమస్యలు ఉండవు.

యూఏఈలో గతంలో ఐపీఎల్ ఎప్పుడు జరిగిందంటే..

మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈలో జరిగితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి అవుతుంది. అంతకుముందు 2014 లో భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. అదేవిధంగా, భారత్ లో కరోనా కారణంగా 2020 సీజన్ పూర్తిగా యూఏఈలో జరిగింది. గత సీజన్‌లో దుబాయ్, అబుదాబి, షార్జాతో సహా 3 స్టేడియంలో 60 మ్యాచ్‌లు జరిగాయి. ఇది యూఏఈకి కూడా మంచి ఆదాయాన్ని ఆర్జించింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బదులుగా బిసీసీఐ గత ఏడాది 98.5 కోట్ల రూపాయలను అరబ్ క్రికెట్ బోర్డుకు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు 31మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం యూఏఈకి పెద్ద విషయం కాదు.

వచ్చే నెలలో యూఏఈలో పాకిస్తాన్ సూపర్ లీగ్..

యూఏఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ఆరవ సీజన్ కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది . ఫిబ్రవరి 20న పాకిస్తాన్ లో ప్రారంభమైన ఈ లీగ్ 6 మంది ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో మార్చి 4న ఆగిపోయింది. ఇక ఆ లీగ్‌లో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 1 నుండి మిగిలిన మ్యాచ్ లు పాకిస్తాన్ లోనే నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే, కరోనా రెండవ వేవ్ కారణంగా ఇది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మిగిలిన 20 మ్యాచ్‌లు జూన్ 5 నుండి యూఏఈలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంది పాకిస్తాన్. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కూడా జరిగింది.

ఐపీఎల్ 2021 టోర్నమెంట్ రద్దు అయితే  2500 కోట్లు నష్టం..

బిసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 15 రోజుల క్రితం ది టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టోర్నమెంట్ నిర్వహించడానికి కంగారు పడటంలేదు. ఆటగాళ్ళ క్షేమం ముఖ్యం అని చెప్పారు. అదేవిధంగా దీనిపై అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ .2500 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.

Also Read: India Vs England: ఐపీఎల్ కోసం టెస్ట్ సిరీస్‌ షెడ్యూల్ మారదు.. క్లారిటీ ఇచ్చిన ఈసీబీ..

Viral Pics: టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ భార్య పెద్ద మోడల్.. ఆ అందాన్ని చూస్తే ఫిదా కావాల్సిందే..!

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..