India Vs England: ఐపీఎల్ కోసం టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారదు.. క్లారిటీ ఇచ్చిన ఈసీబీ..
India Vs England: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను బీసీసీఐ వాయిదా..
India Vs England: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను బీసీసీఐ వాయిదా వేసిన విషయం విదితమే. ఈ టోర్నమెంట్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. దీనితో ఐపీఎల్ కోసం ఈ సిరీస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ పలు రూమర్లు సోషల్ మీడియాలో వినిపించాయి. దీనిపై తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్లారిటీ ఇచ్చింది.
ఐపీఎల్ కోసం ఇంగ్లండ్–భారత్ మధ్య జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఈసీబీ తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య జరగనున్న సిరీస్‌లపై బీసీసీఐ, ఈసీబీ మధ్య చర్చలు జరగాయి. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లను సర్దుబాటు చేయాలంటూ బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యర్ధన రాలేదు. అనుకున్నట్లుగానే షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది అని ఈసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగష్టు 4వ తేదీ నుంచి మొదలవుతుంది.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!