డివిలియర్స్‌ను మించిపోయాడు.. విధ్వంసం సృష్టించాడు.. కేవలం 30 బంతుల్లో 150 పరుగులతో అదరగొట్టాడు..

England County Championship: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సిక్సర్లు...

డివిలియర్స్‌ను మించిపోయాడు.. విధ్వంసం సృష్టించాడు.. కేవలం 30 బంతుల్లో 150 పరుగులతో అదరగొట్టాడు..
Darren Stevens 1

England County Championship: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సిక్సర్లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు డారెన్ స్టీవెన్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ (కెంట్ కౌంటీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 సంవత్సరాల డారెన్ స్టీవెన్స్ కాంటర్బరీ మైదానంలో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు,.కేవలం 30 బంతుల్లో 150 పరుగులు చేసి.. కమ్మిన్స్‌తో 9వ వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఈ పార్టనర్‌షిప్‌లో కమ్మిన్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.

కాంటర్బరీ మైదానం వేదికగా కెంట్, గ్లామోర్గాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. గురవారం మ్యాచ్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న కెంట్ జట్టును గ్లామోర్గాన్ బౌలర్లు దెబ్బతీశారు. దీనితో కేవలం 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సామ్ బిల్లింగ్స్, జాక్ క్రౌలీ వంటి అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవెన్స్ ప్రత్యర్ధి బౌలర్లను అద్భుతంగా ఎదుర్కున్నాడు. మొత్తంగా 149 బంతుల్లో 190 పరుగుల చేశాడు. మొదట్లో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడిన స్టీవెన్స్.. చివర్లో విధ్వంసం సృష్టించాడు.. కేవలం 30 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

Click on your DTH Provider to Add TV9 Telugu