Rohit-Virat: బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. కానీ కోహ్లీ సూపర్బ్ అంటోన్న టీమిండియా పేసర్.!
Rohit Sharma And Virat Kohli: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. వీరిద్దరిలో టీమిండియాకు ఎవరు బెస్ట్ కెప్టెన్.? ఇదే వీరి ఇరువురి...
Rohit Sharma And Virat Kohli: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. వీరిద్దరిలో టీమిండియాకు ఎవరు బెస్ట్ కెప్టెన్.? ఇదే వీరి ఇరువురి ఫ్యాన్స్ మధ్య తరచూ జరుగుతుంటుంది. ఇద్దరికీ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు.. మైదానంలో ఇద్దరి స్ట్రాటజీలు వేరు. ఎవరు బెస్ట్ అనేది చెప్పడం కష్టమే.! ఈ ప్రశ్ననే తాజా టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని కూడా అడిగారు. అనూహ్యంగా అతడు రోహిత్ శర్మకే ఓటేశాడు. రోహిత్ శర్మ పేరును నేరుగా చెప్పకపోయినా.. అతడిపై షమీ ప్రశంసలు కురిపించాడు.
రోహిత్‌పై షమీ ప్రశంసలు…
టెస్ట్ క్రికెట్‌లో భారత ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తున్న సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. షమీ మాట్లాడుతూ, “బౌలర్‌గా, నేను ఎప్పుడైనా రోహిత్‌ని సలహా అడగడానికి వెళ్తే.. అతడి నుంచి ఎప్పుడూ పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. రోహిత్ బౌలర్లకు తరచూ సహాయపడుతుంటాడు. వారు ఇష్టపడే విధంగా బౌలింగ్ చేయడానికి అనుమతిస్తాడు, కొత్త ప్రయోగాలకు కూడా మద్దతు ఇస్తాడు. కెప్టెన్ నుంచి ఓ బౌలర్ ఇంతకన్నా ఎక్కువగా ఏం కోరుకుంటాడని షమీ చెప్పుకొచ్చాడు. రోహిత్ చాలా డిఫరెంట్. ఎలప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం అతని తీరు వేరు అని చెప్పుకొచ్చాడు.
విరాట్‌పై షమీ అభిప్రాయం..
టీమిండియాలోని ఫాస్ట్ బౌలర్లు దూకుడుగా ఉండటానికి కారణం కోహ్లీ. నేను తరచుగా సోషల్ మీడియాలో మ్యాచ్ ఫోటోలు చూస్తున్నప్పుడు.. అందులో కోహ్లీని చూస్తే అనిపిస్తుంది. వికెట్ తీసింది బౌలర్లా.? లేక అతడా.? అని. వికెట్ పడితే చాలు బౌలర్ల కంటే ఎక్కువగా సంబరపడతాడు. అన్నీ విభాగాల్లోనూ అతడు జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. టీమిండియా నెంబర్ వన్ కావడానికి ఎంతగానో శ్రమించాడు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!