Shikhar Dhawan: బ్యాట్‌తోనే కాదు.. వేణువుతో ఆకట్టుకుంటున్న గబ్బర్.. కొత్త వీడియోను షేర్ చేసిన శిఖర్ ధావన్
లాక్‌డౌన్ మధ్య ధావన్ అభిమానుల కోసం ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్రికెట్ ఆటగాడిగానే కాదు ఇప్పుడు కన్హయ్యగా మారిపోయాడు.
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ క్రికెట్ ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే గబ్బర్.. ఆటతోనే కాదు క్రికెట్ మైదానం బయట కూడా అభిమానులకు అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లాక్‌డౌన్ మధ్య ధావన్ అభిమానుల కోసం ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్రికెట్ ఆటగాడిగానే కాదు ఇప్పుడు కన్హయ్యగా మారిపోయాడు. గజల్ ట్యూన్‌ను తన వేణువు నుంచి వినిపించి అభిమానులను అలరించడానికి ప్రయత్నించాడు. ఈ వీడియో అభిమానులును విపరీతంగా ఆకట్టుకుంటోంది .
సమయం దొరికితే ధావన్ వేణువు ఊదడం ఇష్టపడతాడు. అతను 2019 సంవత్సరం నుండి వేణువు ఆడటం నేర్చుకుంటున్నాడు. అతను వేణువు ఆడటం ప్రారంభించినప్పుడు. గత సంవత్సరం లాక్‌డౌన్ సమయంలో అభిమానుల కోసం ఇలాంటి అనేక వీడియోలను షేర్ చేశాడు. ఐపీఎల్ వాయిదా వేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన ధావన్ ఖాళీ సమయం వచ్చిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన వేణువుతో చాలా స్వరాలను పలికించాడు.
View this post on Instagram
ఫ్యాన్స్‌ను ఆట్టుకున్న ధావన్ వీడియో
ధావన్ సుమారు ఒక నిమిషం వీడియోను షేర్ చేశాడు. అభిమానులను ట్యూన్ గుర్తించాలని కోరారు. ఇందులోని వీడియోలో ధావన్ చాలా పరిణతి చెందిన రీతిలో వేణువు ఆడుతూ కనిపించాడు. అభిమానులు ఈ శైలిని చాలా ఇష్టపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
పర్యటనలో శ్రీలంకకు కెప్టెన్ శిఖర్ ధావన్
ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకపై టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించగలడు. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో టెస్ట్ మ్యాచ్‌ల కోసం అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఇంగ్లాండ్‌లో బిజీగా ఉన్నందున ధావన్‌కు జట్టు కమాండ్ ఇవ్వవచ్చు. ఐపిఎల్ 2021 గురించి మాట్లాడుతూ టోర్నమెంట్ సస్పెండ్ అయ్యేవరకు శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. 8 మ్యాచ్‌ల్లో 54.28 సగటుతో, 134.27 స్ట్రైక్ రేట్‌లో 380 పరుగులు చేశాడు.