Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 కిలోమీటర్ల పరుగు పందెంలో ఆటగాళ్లు ఫెయిల్..! ఇక టీమ్ ఇండియాతో ఏం పోటీ పడతారు..?

Sri Lankan Cricketers : శ్రీలంక జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. జట్టుకు కొత్త కెప్టెన్ ఉన్నాడు. కొత్త వైస్ కెప్టెన్ ఉన్నాడు.

2 కిలోమీటర్ల పరుగు పందెంలో ఆటగాళ్లు ఫెయిల్..! ఇక టీమ్ ఇండియాతో ఏం పోటీ పడతారు..?
Sri Lankan Cricketers
Follow us
uppula Raju

|

Updated on: May 22, 2021 | 6:09 PM

Sri Lankan Cricketers : శ్రీలంక జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. జట్టుకు కొత్త కెప్టెన్ ఉన్నాడు. కొత్త వైస్ కెప్టెన్ ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్ళు డిశ్చార్జ్ కావడం వల్ల అందరు కొత్తవాళ్లే. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి వన్డేకు ముందు ఇద్దరు ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్‌ అయ్యారు. దీంతో శ్రీలంక జట్టు అయోమయంలో పడింది. తొలి మ్యాచ్‌కు ముందే ధనుష్క గుణతిల్లెకె, ధనంజయ డి సిల్వా తమ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

బంగ్లాదేశ్ పర్యటన కోసం శ్రీలంక జట్టుకు కుషల్ పెరెరాను కెప్టెన్‌గా, కుసల్ మెండిస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఈ కెప్టెన్, వైస్ కెప్టెన్ల బృందం ఫిట్‌నెస్ స్థాయికి సరిపోదు. ఇదే జట్టు జూలైలో ఫిట్ గా ఉన్న టీం ఇండియా ఆటగాళ్ళతో వైట్ బాల్ సిరీస్ ఆడవలసి ఉంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు, శ్రీలంక జట్టు యాజమాన్యం వారి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి 2 కి.మీ. పరుగు పందేన్ని నిర్వహించింది. ధనుష్క గుణతిల్కే, ధనంజయ్ డి సిల్వా ఇందులో ఫెయిల్ అయ్యారు.

అయితే వారు బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు దూరంగా ఉండరు కానీ ఫిట్‌నెస్‌ పరీక్షను మరోసారి ఎదుర్కొంటారు. అందులో కూడా వారు విఫలమైతే, బంగ్లాదేశ్ తరువాత ఇంగ్లాండ్ వెళ్లే జట్టులో స్థానం కోల్పోతారు. శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు 2 కిలోమీటర్ల రేసును ప్రతి 40 రోజులకు ఒకసారి పాస్ కావాలి. వారు ఈ దూరాన్ని 8 నిమిషాల 35 సెకన్లలో పూర్తి చేయాలి. ప్రతి క్రీడాకారుడు రాబోయే 40 రోజుల్లో మరోసారి మరో అవకాశాన్ని పొందుతాడు. అతను పూర్తి చేయకపోతే జట్టు నుంచి బయటికి వెళ్లవలసి ఉంటుంది.

Weight Loss Exercises : బరువు తగ్గడానికి, బెల్లీఫ్యాట్‌ కరగడానికి ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు సూపర్..! ట్రై చేసి చూడండి..

Mega oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Anandayya : ఆనందయ్య కరోనా మందుతో ప్రాణాలు నిలబడ్డాయని చెప్పిన రిటైర్డ్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి మళ్లీ మొదటికి.!