Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు
Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు 'మేఘా' సంస్థ మహా యజ్ఞం చేస్తోంది. అందులో భాగంగా థాయ్‌లాండ్ నుంచి భారీ క్రయోజెనిక్ ట్యాంకులు తెప్పిస్తోంది...
Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం చేస్తోంది. అందులో భాగంగా థాయ్‌లాండ్ నుంచి భారీ క్రయోజెనిక్ ట్యాంకులు తెప్పిస్తోంది. తొలి విడతగా 3 ట్యాంకులు హైదరాబాద్ చేరుకున్నాయి. అలాగే డీఆర్‌డీవో సాయంతో పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు మేఘా సంస్థ చేపట్టిన యజ్ఞంలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా అధిక సంఖ్యలో క్రయోజెనిక్ ట్యాంకులను థాయ్‌లాండ్ నుంచి తెప్పించింది. అయితే సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి.
ప్రాణవాయువు కోసం దేశమే హైరానా పడుతున్న సమయంలో మేఘా సంస్థ ఆహన్న హస్తం అందించింది. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తనవంతు బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుబాటులో ఉన్న వనరులతో వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ ప్రజలకు అందించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా థాయ్‌ల్యాండ్ నుంచి ఆక్సిజన్ ట్యాంకులు తెప్పిస్తోంది.
ఒక్కో ట్యాంక్ కోటి 40 లక్షల లీటర్లు
కాగా, ఒక్కో ట్యాంక్ కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ రవాణా చేయనున్నాయి. ఇలాంటివి 11 ట్యాంకులను థాయ్‌లాండ్ నుంచి తెప్పిస్తోంది. శనివారం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి వచ్చాయి. వీటిని ప్రభుత్వం అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశాల నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా ఉచితంగా 11 ట్యాంకర్లు థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసింది మేఘా సంస్థ. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్మీ విమానంలో 3 ట్యాంకులు వచ్చాయి. అయితే ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వానికి ఉచితంగా అందివ్వనుంది మేఘా సంస్థ. వీటితోపాటు డీఆర్డీవో రెడీ చేసిన పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. నాలుగు ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నారు. 20 రోజుల్లో 100 యూనిట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
మూడు చోట్ల 220 టన్నుల ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం గల ప్లాంట్లు సిద్ధం చేయబోతోందీ మేఘా సంస్థ. 15 రోజుల్లో వీటిని ప్రారంభం చేయనున్నారు. 110 టన్నులు సామర్థ్యంతో ఉన్న ప్లాంటు ఒకటి, 55 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ప్లాంట్లు రెండు ప్రారంభించబోతున్నారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో నెలకొల్పనుండగా, మరో రెండు ప్రాంతాల్లో రెండింటిని ప్రారంభం చేయనున్నారు. అయితే ఒక్కొక్కటి 7వేల లీటర్లు గల ఆక్సిజన్ సిలిండర్లను ప్రతి రోజు కనీసం పది ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 4,242 సిలిండర్లను వివిధ ఆస్పత్రులకు సరఫరా చేశారు. ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ (మెయిల్) ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన సలహా కమిటీకి చెందిన సీనియర్ అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది.