AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zimbabwe Batsman Ryan Burl: బూట్లు కొనుకునేందుకు కూడా డబ్బులు లేవు.. ప్లీజ్ మాకు స్పాన్సర్లు కావాలి…!

జింబాబ్వే క్రికెటర్​ ర్యాన్ బర్ల్​ ట్విట్టర్​లో పెట్టిన ఓ ఫొటో ఆ దేశ బోర్డు పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. చిరిగిన బూట్లను అతికించే ఓ ఫోటోను పోస్ట్​ చేశాడు. స్పాన్సర్లు ఉంటే ఇలా ప్రతి..

Zimbabwe Batsman Ryan Burl: బూట్లు కొనుకునేందుకు కూడా డబ్బులు లేవు.. ప్లీజ్ మాకు స్పాన్సర్లు కావాలి...!
Zimbabwe Batsman Ryan Burl
Sanjay Kasula
|

Updated on: May 23, 2021 | 8:39 PM

Share

బీసీసీఐ (BCCI) అంటేనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. ఒక్కసారి బీసీసీఐ, దాని అనుబంధ క్రికెట్ అసోసియేషన్ల కాంట్రాక్టు లభిస్తే ఆ క్రికెటర్ పంట పండినట్లే. రంజీ మ్యాచ్‌లు (Ranji Trophy) ఆడినా లక్షల రూపాయలు సంపాదించ వచ్చు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ బోర్డుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలా కొన్ని దేశాలు అంతో ఇంతో బాగున్నాయి. చాలా దేశాలు ఆర్ధికంగా నష్టాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల ఆటగాళ్లకు కనీస వసతులు కూడా కల్పించలేదని స్థితిలో ఆమా దేశాలు ఉన్నాయంటే నమ్మండి. ఇలాంటి పరిస్థితిని అద్దం పట్టేలా ఓ క్రీడాకారుడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. జింబాబ్వే క్రికెటర్​ ర్యాన్ బర్ల్​ ట్విట్టర్​లో పెట్టిన ఓ ఫొటో ఆ దేశ బోర్డు పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. చిరిగిన బూట్లను అతికించే ఓ ఫోటోను పోస్ట్​ చేశాడు. స్పాన్సర్లు ఉంటే ఇలా ప్రతి సిరీస్ తర్వాత తాము బూట్లను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటూ రాసి ఆ పోస్టుకు జోడించాడు.

స్పాన్సర్​షిప్​లు, బ్రాడ్​కాస్ట్​ హక్కుల ద్వారా ఓవైపు సంపన్న క్రికెట్ బోర్డులు లక్షల కొద్దీ ఆదాయాన్ని గడిస్తున్న నేటి రోజుల్లో.. జింబాబ్వే క్రికెట్ బోర్డు పరిస్థితి దయనీయంగా మారింది. ఆటగాళ్లకు కనీసం బూట్లు కొనలేని స్థితిలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఉంది.  తన చిరిగిపోయిన బూట్లను ట్విట్టర్​లో పోస్టు చేశాడు ర్యాన్​. “మాకు స్పాన్సర్లు దొరికితే.. ప్రతి సిరీస్ తర్వాత ఇలా బూట్లను బాగుచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. ఎవరైనా ఉన్నారా?” అని ఆ ఫొటో కింద రాసుకున్నాడు.

ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను 2019లో ఐసీసీ నిషేధించింది. తిరిగి అదే ఏడాది అక్టోబర్​లో నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ కరోనా కారణంగా జరగాల్సిన పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది పాకిస్తాన్​ ఆ దేశంలో పర్యటించింది. అయినా బోర్డుకు తగినంత ఆదాయం రాలేదు. దీంతో అక్కడి ఆటగాళ్లకు కనీసం కాంట్రాక్ట్ డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితిలో జింబాబ్వే బోర్డు ఉంది.

ఇవి కూడా చదవండి :  He can do it in next match: ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ కొట్టడం ఖాయం.. కోహ్లీకి అండగా నిలిచిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..

Beer for Vaccine: టీకా వేయించుకోండి.. బీరు ఫ్రీగా తీసుకోండి.. సేవింగ్స్ బాండ్స్ కూడా ఇస్తాం.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడంటే..