AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం

PM Narendra Modi review : యాస్ తుఫాను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ..

CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం
Pm Narendra Modi Review
Venkata Narayana
|

Updated on: May 23, 2021 | 12:27 PM

Share

PM Narendra Modi review : యాస్ తుఫాను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొంచెంసేపటి క్రితం వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, టెలికాం కార్యదర్శులు, విద్యుత్, పౌర విమానయానం, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలతో పిఎం నరేంద్ర మోడీ సైక్లోన్ యాస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న సన్నాహాలను సమీక్షించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటూ మోదీ ఆయా మంత్రిత్వశాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ దిశానిర్ధేశం చేశారు.

కాగా, యాస్ తుఫానుపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) స‌మావేశం నిన్న జ‌రిగిన సంగతి తెలిసిందే. తూర్పున బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మై ఉన్న ‘యాస్’ తుఫాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఏజెన్సీల సంసిద్ధతను ఎన్‌సీఎంసీ స‌మావేశంలో సమీక్షించింది. మే 26 సాయంత్రానికి యాస్ తుపాను పశ్చిమ బెంగాల్, ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా రాష్ట్ర తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. తుపాను యొక్క తాజా స్థితి గురించి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) ఈ కమిటీకి వివరించారు. యాస్ తుపాను గాలి వేగం 155 నుండి 165 కిలోమీటర్ల మేర ఉండ‌వ‌చ్చ‌ని.. దీంతో ఈ రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో కూడిన‌ తుఫాను వ‌ర్షాలు సంభవించే అవ‌కాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ వెల్లడించారు. తుఫాను ఎదుర్కోవటానికి సన్నాహక చర్యల గురించి సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు.

ఇలాఉండగా, యాస్ ముప్పు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలిస్తున్నారు. ఆహార ధాన్యాలు, తాగు నీరు, ఇతర నిత్యావసర సామాగ్రి సంబంధించి త‌గు నిల్వలు ఏర్పాటు చేశారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, టెలికమ్యూనికేషన్స్ వంటి అవసరమైన సేవలకు అవరోధం కలుగకుండా సన్నాహాలు చేసుకున్నారు. 65 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల‌ను మోహరించడంతోపాటు, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌ల‌కు చెందిన‌ రెస్క్యూ ఇంకా, రిలీఫ్ టీంలతో పాటుగా ఓడలు మసాయ‌రియు విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్