AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: అమెరికాలో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది..సామాజికంగా మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు

America: అమెరికాలో కుటుంబాల మధ్య విభజన సమస్య చాలా విస్తృతంగా మారుతోంది. కార్నెల్ విశ్వవిద్యాలయం ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

America: అమెరికాలో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది..సామాజికంగా మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు
America
KVD Varma
|

Updated on: May 23, 2021 | 9:43 PM

Share

America: అమెరికాలో కుటుంబాల మధ్య విభజన సమస్య చాలా విస్తృతంగా మారుతోంది. కార్నెల్ విశ్వవిద్యాలయం ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో 27% వయోజన అమెరికన్లు వారి కుటుంబ సభ్యుల నుండి వేరు చేయబడ్డారని కనుగొన్నారు. ప్రజలు పెద్దలను విదిచిపెట్టేయటానికి ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అందుకే, అక్కడ విడిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనా విభాగాధిపతి సోషియాలజీ ప్రొఫెసర్ కార్ల్ పిలేమర్ చెప్పారు. తల్లిదండ్రులు, వయోజన పిల్లల మధ్య చాలా తరచుగా ఇటువంటి ఇబ్బందులతో కేసులు వస్తున్నాయి. చాలా సందర్భాలలో పిల్లలు అమెరికాలో కుటుంబం నుండి వేరుగా వెళ్ళిపోతున్నారు. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు, మనస్తత్వవేత్తలు కుటుంబాల మధ్య విభజన పెరుగుతోందని చెబుతున్నారు. అదే సమయంలో, డాక్టర్ కోల్మన్ వ్యక్తిగత సంతృప్తి కోసమే ఇలా వేరు పడడానికి పెద్ద కారణమని చెప్పారు.

మనస్తత్వవేత్త జాషువా కోల్మన్ ప్రకారం, పిల్లలను కలిగి ఉన్న 1600 మంది తల్లిదండ్రుల సర్వేలో 70% కంటే ఎక్కువ మంది ఒకరినొకరు విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు తండ్రిని విడిచిపెట్టే అవకాశం ఉంది. యుఎస్‌లో, విడాకుల రేటు కొన్నేళ్లుగా తగ్గింది. ఏదేమైనా, తల్లిదండ్రుల-పిల్లల విభజన యొక్క ధోరణి గతంలో కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ కోల్మన్ అభిప్రాయపడ్డారు. ప్రజల దీనికి ఆనందం అతి పెద్ద కారణం. ప్రజలు తమ ఆనందానికి లేదా భావాలకు ఆటంకం కలిగించే బంధువుల నుండి దూరంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది వేధింపులకు గురై కూడా తల్లిదండ్రులను వదిలివేస్తారు. ఏదైనా వ్యర్ధక్యంలో వారిని విడిచి పెట్టడం వలన సామాజికంగా ఇబ్బందులు తలెత్తుతాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పెద్దవాళ్ళను పిల్లలను ఒంటరిగా విడిచి పెట్టేస్తుండడం వల్ల వారిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని మానసిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం..పెద్ద వాళ్ళను అలా వదిలేయడం వలన వారికి చేయూత అందించేవారు కరువైపోతారు. దీంతో వారిలో మానసిక కుంగుబాటు మొదలవుతుంది. అది శారీరక అనారోగ్యానికీ కారణం అవుతుంది.

Also Read: Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Blind Village : ఆ గ్రామంలో మనుషులు, జంతువులు అందరూ గుడ్డివారే..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..