AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SUEZ CANAL: ఎవర్ గివెన్ షిప్ వ్యవహారంలో కొత్త మలుపు.. తప్పంతా సూయిజ్ అథారిటీదేనంటూ ఎదురు దాడి

రెండు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సూయిజ్ కాల్వలో సరుకు రవాణా నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోయిన విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. కాల్వలో ఎవర్ గివెన్ చిక్కుకుపోవడంతో...

SUEZ CANAL: ఎవర్ గివెన్ షిప్ వ్యవహారంలో కొత్త మలుపు.. తప్పంతా సూయిజ్ అథారిటీదేనంటూ ఎదురు దాడి
Ever Given Ship
Rajesh Sharma
|

Updated on: May 24, 2021 | 1:17 PM

Share

SUEZ CANAL EVER GIVEN CONTROVERSY: రెండు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సూయిజ్ కాల్వలో సరుకు రవాణా నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోయిన విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. కాల్వలో ఎవర్ గివెన్ చిక్కుకుపోవడంతో ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టాన్ని మిగిల్చిందని భావిస్తున్న సూయిజ్ కాల్వ నిర్వహణ కమిటీ.. నష్టపరిహారం కోసం ఎవర్ గివెన్ నౌక యాజమాన్యానికి నోటీసు పంపడంతో సరికొత్త వివాదం మొదలైంది. అసలు షిప్ ఇరుక్కుపోవడానికి సూయిజ్ కాల్వ నిర్వహణ కమిటీయేనని ఎవర్ గివెన్ నౌక యాజమాన్యం తాజాగా కొత్త వాదన మొదలు పెట్టింది. తమ వాదనను సమర్థిచుకునేందుకు ఎవర్ గివెన్ నౌక సిబ్బందికి, సూయిజ్ కాల్వ నిర్వహణ అథారిటీ సిబ్బందికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా విడుదల చేసింది ఎవర్ గివెన్ నౌక యాజమాన్యం.

ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణ నౌక ఎవర్‌ గివెన్‌ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం సూయజ్‌ కెనాల్‌ అథారిటీదే అంటోంది ఎవర్ గివనె షిప్ మేనేజ్‌మెంటు సంస్థ షోయి కిసైన్‌. వాతావరణం సరిగా లేనప్పుడు ఎవర్‌ గివెన్‌ వంటి పెద్ద ఫిప్‌ను కెనాల్‌లోకి ఎంటరయ్యేందుకు ఎలా అనుమతించారని ఎదురు ప్రశ్నిస్తోంది. ప్రయాణానికి అనుమతించడం సూయిజ్‌ అథారిటీ చేసిన తప్పుగా షోయి కిసైన్ వాదిస్తోంది. నౌక తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవంటూ రికార్డులు చూపిస్తోంది. ప్రమాదానికి ముందు సూయజ్‌ కెనాల్‌ అథారిటీ, నౌకా సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణను సైతం వెల్లడించింది. భారీ నౌకల సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్‌ని సూయిజ్‌ కెనాల్‌ అథారిటీ సరిగా పాటించలేదని ఎదురుదాడి చేస్తోంది. గత మూడు నెలలుగా ఎవర్‌ గివెన్‌ను సీజ్‌ చేసిందుకు గాను నష్టపరిహారంగా లక్ష డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. సూయజ్‌ కాలువ ప్రమాదంపై ఇస్లామియా ఎకనామిక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవర్‌గివెన్‌ నౌక యాజమాన్య సం‍స్థ షోయి కిసైన్‌ సంస్థ తన వాదనలు వినిపించింది.

ప్రపంచంలోనే అత్యంత రద్ధీ వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటైన సూయిజ్‌ కెనాల్‌లో మార్చి 23న ఎవర్‌ గివెన్‌ నౌక చిక్కుకుపోయింది. నౌక ముందు, వెనక భాగాలు కెనాల్‌ చెరో తీరాన్ని ఢీకొట్టాయి. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోవడంతో .. అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు వారం రోజులకు పైగా నిలిచిపోయాయి. టగ్‌ బోట్ల సాయంతో ఎట్టకేలకు ఎవర్‌ గీవెన్‌ను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఎవర్‌ గివెన్‌ నౌకను సీజ్‌ చేసింది సూయిజ్‌ కెనాల్‌ అథారిటీ. నష్టపరిహారంగా 916 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేసింది.

ALSO READ: బ్లాక్ ఫంగస్‌కు కారణం స్టెరాయిడ్స్, డయాబెటీస్ కాదట.. ఇంకేదో వుందంటున్న ఇండోర్ ప్రొఫెసర్

ALSO READ: సర్వత్రా థర్డ్ వేవ్ టెన్షన్.. కేంద్రం కూడా దృష్టి సారించడంతో ఇక ఖాయమేనన్న కథనాలు