AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

coronavirus: కరోనా వైరస్ పాండమిక్ ‘పుట్టిల్లు’ వూహాన్ ల్యాబ్ మళ్ళీ వార్తల్లోకి…..

ప్రపంచాన్ని ఇప్పటికీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందని అమెరికా తదితర దేశాలు ఆరోపిస్తుండగా అలాంటిదేమీ లేదని చైనా బుకాయిస్తూ వస్తోంది.

coronavirus: కరోనా వైరస్ పాండమిక్ 'పుట్టిల్లు' వూహాన్ ల్యాబ్ మళ్ళీ వార్తల్లోకి.....
3 Wuhan Lab Researchers Sought Hospital Care
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 24, 2021 | 12:13 PM

Share

ప్రపంచాన్ని ఇప్పటికీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందని అమెరికా తదితర దేశాలు ఆరోపిస్తుండగా అలాంటిదేమీ లేదని చైనా బుకాయిస్తూ వస్తోంది. కావాలంటే మా ల్యాబ్ ని తనిఖీ చేసుకొండి అని మొండిగా వాదిస్తూ వస్తోంది. కానీ తాజాగా ఈ డేంజరస్ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే జనించిందనడానికి ఆధారంగా ఓ తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ల్యాబ్ లోని ముగ్గురు రీసెర్చర్లు నాడే ఈ వైరస్ కి గురయ్యారని తెలుస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నిన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉటంకిస్తూ వార్తలు ప్రచురించింది. 2019 నవంబరులోనే వారు తాము హాస్పిటల్ లో చేరుతామంటూ ఇందుకు అధికారుల అనుమతిని కోరారట.. వారి అస్వస్థత తాలూకు టైమింగ్, వారి హాస్పిటల్ విజిట్స్, తదితరాలన్నింటిపైనా ఫ్రెష్ వివరాలు-అసలు ఈ వైరస్ ఈ లేబొరేటరీ నుంచి ‘తప్పించుకుని’ ఎలా ప్రపంచ వ్యాప్తమైందన్నదానిపై విస్తృత పరిశోధనలు జరగడానికకి ఊతమిస్తున్నాయి. కోవిద్=19 పుట్టుక (ఆరిజిన్) పై తదుపరి దశ ఇన్వెస్టిగేషన్ మీద చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో ప్రత్యేకంగా సమావేశమవుతోంది. దీంతో వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కోవిద్-19 ఆరిజిన్ పై ఇప్పటికీ బైడెన్ ప్రభుత్వం సీరియస్ అనుమానాలను, ప్రశ్నలను లేవనెత్తుతోందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. అందువల్లే దీని పుట్టుక గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోను, సభ్య దేశాలతోనూ చర్చలు జరుపుతోందని ఆమె చెప్పారు.

మేం నిపుణుల అంచనాలను, తాజా పరిశోధనల వివరాలను తెలుసుకోగోరుతున్నాం అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి దశలో నిర్వహించిన అధ్యయనంపై అమెరికా, నార్వే, బ్రిటన్ తదితర దేశాలు గత మార్చి నెలలోనే దృష్టి పెట్టాయి. దీనిపై మరింత దర్యాప్తు జరగాలని పిలుపునిచ్చాయి. అవసరమైతే ఈ విషయంలో చైనాకు తాము తోడ్పడతామని అమెరికా హామీ ఇచ్చినప్పటికీ వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు. వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ తప్పించుకుని ఉండవచ్చునని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నాడే నెత్తీ నోరూ బాదుకుంది. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం దాన్ని ఖండిస్తూ వచ్చింది.అంతే కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందానికి తమ డేటా రికార్డులను అందజేయడానికి తిరస్కరించింది. ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన వార్తలపై ఎలా స్పందిస్తుందో మరి ?

మరిన్ని ఇక్కడ చూడండి: Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళ ఐసీఎంఆర్‌ బృందం రావడంలేదుః జిల్లా కలెక్టర్