Coronavirus: కుక్కలు మనిషి చెమట వాసనను ద్వారా కరోనాను గుర్తిస్తాయి: తాజా పరిశోధనలో లండన్ శాస్త్రవేత్తలు
Coronavirus: కరోనా వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందా..? అంటే అవుననే అంటున్నారు లండన్‌కు చెందిన పరిశోధకులు...
Coronavirus: కరోనా వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందా..? అంటే అవుననే అంటున్నారు లండన్‌కు చెందిన పరిశోధకులు. తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇప్పుడు దీని ఆధారంగా కుక్కల ద్వారా కరోనా రోగులను గుర్తించే పనిలో పడ్డారట. మనిషి చెమట వాసనతో కరోనా వైరస్ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని పరిశోధకులు తేల్చారు. వాటి ద్వారా కరోనా రోగులను గుర్తించడం ప్రారంభించారు.
చెమల వాసన ద్వారా మనుషుల్లో కరోనా లక్షణాలను కుక్కలు గుర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు వాటికి శిక్షణ ఇవ్వవచ్చని అన్నారు. మనుషుల్లో ఉండే కరోనా లక్షణాలను కుక్కలు 90 శాతానికిపైగా గుర్తిస్తాయని పరిశోధనల ద్వారా తేల్చారు. కుక్కలు SARS-CoV-2ను గుర్తించగలవని పరిశోధనలలో రుజువైనట్లు లండన్ పరిశోధకులు వెల్లడించారు. అయితే లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు గుర్తిస్తాయని అన్నారు. కోవిడ్ ఉన్న వ్యక్తుల మాస్క్‌లు, దుస్తులను సేకరించి ఈ పరిశోధన చేపట్టారు. అయితే కుక్కలకు శిక్షణ ఇస్తే కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తాయని పరిశోధనలలో స్పష్టమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్లే ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో శునకాలు గుర్తిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మనుషుల్లో మలేరియా, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.
కాగా, విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్‌ల వద్ద కుక్కులు సుమారు 91 శాతం పాజిటివ్ కేసులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ట్యూమర్స్, క్యాన్సర్ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా శునకాలను వాడుతున్నారు. ఇప్పుడు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరోనా రోగుల నిర్ధారణకు కూడా వినియోగించుకోవచ్చని అంటున్నారు లండన్ పరిశోధకులు.