Covid-19: కరోనా మరణాల్లో మూడోస్థానానికి భారత్.. అమెరికా, బ్రెజిల్ తరువాత దేశంలో 3 లక్షలు దాటిన కరోనా మరణాలు..
India Covid-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం సెకండ్ వేవ్
India Covid-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. మన దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ భీకర ప్రళయాన్ని సృష్టించకపోయినా.. సెకెండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ.. నిత్యం కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా మృతుల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరకుంది. తాజగా దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. దీనికిముందు అమెరికా, బ్రెజిల్‌లో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య మూడు లక్షలు దాటింది. నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకూ 2,99,266 మంది మృతి చెందారు. దీనికి రాష్ట్రాల నుంచి వచ్చిన తాజా డేటాను జతచేస్తే ఈ సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ఆరోగ్యశాక వెల్లడించింది.
కాగా దేశంలో అత్యధిక మంది మహారాష్ట్రలో మరణించారు. మహారాష్ట్రలో దాదాపు 90వేల మంది మరణించారు. కర్ణాటకలో 24వేల మంది, ఢిల్లీలో 23 వేలు, తమిళనాడులో 20వేలకు పైగా మరణించారు. అయితే.. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారిలో 70 శాతానికి పైగా బాధితులు ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడినవారేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికిముందు ప్రపంచంలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. నాలుగు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టాయి. రెండున్నర లక్షలకు చేరువలో కేసులు నమోదవుతుండగా.. దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read: