AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thirdwave Tension: సర్వత్రా థర్డ్ వేవ్ టెన్షన్.. కేంద్రం కూడా దృష్టి సారించడంతో ఇక ఖాయమేనన్న కథనాలు

రెండు నెలలుగా దేశం కరోనా రెండో దశతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మార్చి నెల రెండో వారంలో మొదలైన రెండో దశ కరోనా వ్యాప్తి ఇంకా ఉధృతంగానే వుంది. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించబోరన్న విశ్వాసానికి...

Thirdwave Tension: సర్వత్రా థర్డ్ వేవ్ టెన్షన్.. కేంద్రం కూడా దృష్టి సారించడంతో ఇక ఖాయమేనన్న కథనాలు
India Corona Third Wave
Rajesh Sharma
| Edited By: Team Veegam|

Updated on: May 23, 2021 | 8:41 PM

Share

Corona Thirdwave Tension : రెండు నెలలుగా దేశం కరోనా రెండో దశతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మార్చి నెల రెండో వారంలో మొదలైన రెండో దశ కరోనా వ్యాప్తి ఇంకా ఉధృతంగానే వుంది. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించబోరన్న విశ్వాసానికి సెకెండ్ వేవ్ కరోనా గండి కొట్టింది. లాక్ డౌన్ లేకుండానే సెకెండ్ వేవ్‌ని నియంత్రిద్దాం అనుకున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం కఠినాతికఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేయాల్సిన పరిస్థితిని శరవేగంగా విస్తరించే స్వభావాన్ని కలిగి వున్న కరోనా మ్యూటెంట్ కలిగించింది. ముఖ్యంగా ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రస్తుతం మే మూడో వారం దాకా సెకెండ్ వేవ్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. మే రెండో వారం తర్వాత రోజూ వారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల నుంచి రెండున్నర లక్షలకు తగ్గాయి. కానీ రోజూవారీ మరణాల సంఖ్యలో మాత్రం పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. మే 20వ తేదీ దాకా దేశంలో రోజు వారీ కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకుపైనే వుంది. మే 21, 22 తేదీలలో వెల్లడైన గణాంకాలలో మాత్రం రోజూవారి మరణాల సంఖ్య నాలుగు వేలకు లోపుగా రికార్డవుతోంది.

ఇదిలా వుంటే.. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ జూన్ మాసాంతానికి లేదా జులై రెండో వారానికి తగ్గిపోతుందని వైద్య నిపుణులు అంఛనా వేస్తున్నారు. కానీ ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలలకు కచ్చితంగా కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయమని భయాందోళన కలిగించే ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్‌ వేవ్‌ నేర్పిన గుణపాఠంతో థర్డ్‌వేవ్‌కి ముందుగానే సన్నద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.

కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని ముంచెత్తగానే ఎదురైన మొట్టమొదటి సమస్య ఆక్సిజన్‌ కొరత. దీంతో ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెషర్‌ అడ్‌ర్సాప్షన్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్రాలకు ప్రతిపాదిస్తోంది. ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని 2021 జులై 30వ తేదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. జులై చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,051 ప్రెషర్ ఆడ్‌ర్సాప్షన్ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే.. రెండు వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఇక 50 నుంచి 100 బెడ్ల సామర్థ్యం ఉండే మధ్య, చిన్న తరహా ఆస్పత్రుల కోసం 450 లీటర్ల ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు ఏకంగా కొత్తగా లక్ష ఆక్సిజన్‌ సిలిండర్లు తయారీకి ఆర్డర్‌ ఇచ్చింది కేంద్రం.

ప్రస్తుతం ఆక్సిజన్‌ రవాణాకు ఎక్కువ సమయం పడుతోంది. తక్కువ సమయంలో ఆస్పత్రులకు తరలించడం కష్టసాధ్యమవుతోంది. దాంతో ఆక్సిజన్‌ తరలించేందుకు ప్రత్యేకంగా రైళ్లు, విమానాలు నడిపించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,270 ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉన్నాయి. వీటికి తోడు మరో వంద ట్యాంకర్లు తయారు చేస్తున్నారు. వీటికి అదనంగా 248 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్‌ రవాణను గ్రీన్‌ ఛానల్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

కరోనా చికిత్సలో ఉపయోగించే అత్యవసర, సాధారణ ఔషధాలు రెండు మూడు నెలలకు సరిపడ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తయారీదారులతో కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఔషధాల కొరత రాకుండా చూడాలంటూ ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కరోనా సెంకడ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. మరోవైపు దేశంలో అక్కడక్కడ కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబరు నుంచి డిసెంబర్‌ మధ్యన ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చేందుకు అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ముందుగానే సన్నద్ధం అవుతోంది.

Read Also: విమానాశ్రయ లాంజ్ లో కోతి.. అది చేసిన పని చూస్తే మీరు నవ్వాపుకోలేరు..Viral Video

ఎక్కువవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..చికిత్స కోసం రాష్ట్రాలకు ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం

కారు వదిలి స్కూటర్ పై వెళ్తుండగా నాటకీయంగా రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ , మూడు అభియోగాల నమోదు