AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: ఎక్కువవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..చికిత్స కోసం రాష్ట్రాలకు ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం

Black Fungus: దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. గుజరాత్‌, మహారాష్ట్ర తరువాత మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి.

Black Fungus: ఎక్కువవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..చికిత్స కోసం రాష్ట్రాలకు ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం
Black Fungus
KVD Varma
|

Updated on: May 23, 2021 | 6:50 PM

Share

Black Fungus: దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. గుజరాత్‌, మహారాష్ట్ర తరువాత మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను కేంద్రం రాష్ట్రాలకు పంపిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి నిన్న 23,680 యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను కేంద్రం కేటాయించింది. ఈ ఇంజక్షన్లను కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్షణం పంపిస్తున్నట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 8,848 మంది రోగుల సంఖ్య ఆధారంగా ఈ కేటాయింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోన్న మరో ముప్పు బ్లాక్‌ ఫంగస్‌.

వెంటనే గుర్తించి వైద్యం చేయకపోతే బ్లాక్‌ ఫంగస్‌ ప్రాణాంతకంగా మారుతోంది. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థను ఈ వ్యాధిని తిప్పికొడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, అదుపులోలేని మధుమేహ రోగులు ఎక్కువగా దీనిబారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఫంగస్‌ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలుంటాయో తెలియజేస్తూ ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ ఒక పోస్టర్‌ విడుదల చేసింది.

ఆ పోస్టర్ ప్రకారం..

  • కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతోపాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి.
  • జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి.
  • వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి.

ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.

ట్రీట్​మెంట్​ ఉందా?

బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్​-బీ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ మందుల కొరత ఉన్నందున చికిత్స కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మే 21 నాటికి దేశవ్యాప్తంగా నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసలు 8,848. ఇందులో అత్యధికంగా గుజరాత్‌లో 2,281 కేసులు, మహారాష్ట్రలో 2,000 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 910 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో 58.6 శాతం ఈ మూడు రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఆధారంగా యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

నిన్న కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ రాష్ట్రాలలో నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, కేంద్రం పంపిణీ చేసిన యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్ల వివరాలు…

రాష్ట్రం            బ్లాక్‌ ఫంగస్‌ కేసులు         ఇంజక్షన్ల సంఖ్య

1. గుజరాత్‌                  2,281                    5,800 2. మహారాష్ట్ర              2,000                   5,090 3. ఆంధ్రప్రదేశ్‌           910                       2,310 4. మధ్యప్రదేశ్‌            720                       1,830 5. రాజస్థాన్‌                 700                       1,780 6. కర్ణాటక                   500                       1,270 7. తెలంగాణ              350                         890 8. హర్యానా                 250                        640 9. ఢిల్లీ                         197                         670 10. ఉత్తరప్రదేశ్‌         112                            380

  • మే 21 నాటికి అన్ని రాష్ట్రాలలో కలిపి నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మొత్తం – 8,848
  • అన్ని రాష్ట్రాలలో కలిపి నిన్న కేంద్రం కేటాయించిన యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు మొత్తం – 23,680
  • దేశంలో అత్యధికంగా 10 రాష్ట్రాలలో నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు – 8,020
  • ఈ 10 రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్ల – 20,660
  • మిగిలిన 3,020 ఇంజక్షన్లలో 1520 ఇతర రాష్ట్రాలకు, మరో 1500 వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించారు.

Also Read: Vaccination Process: వ్యాక్సిన్ తీసుకున్న త‌ల్లులు.. పిల్ల‌ల‌కు ఎప్ప‌టి నుంచి పాలివ్వొచ్చు..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం..

Black fungus infection: అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్ ఫంగస్..! దీనిపై వైద్య నిపుణుల మ‌ధ్య‌ భిన్నాభిప్రాయాలు