నటనలోనే కాదు చదువులోనూ మెగాస్టారే.. చిరంజీవి క్వాలిఫికేషన్స్ ఇవే
28 December 2024
Basha Shek
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు అద్భుతం
ఎన్టీఆర్,ఏఎన్నార్ తర్వాత అంతటి స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించుకున్నది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే
నటన, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్.. ఇలా చిరంజీవి ఏం చేసినా ప్రేక్షకులు ముచ్చటపడి మరీ చప్పట్లు కొడుతారు.
మరి సినిమాల్లో మెగాస్టార్ గా వెలుగొందుతోన్న చిరంజీవి ఏం చదువుకున్నారో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి.
చిరంజీవి విద్యాభ్యాసం మొదట నిడదవోలులో ప్రారంభమైంది. ఆ తర్వాత.. గురజాల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో సాగింది.
ఒంగోలులోని పీఆర్ శర్మ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివారు చిరంజీవి.ఆ తర్వాత నర్సాపూర్ కళాశాలలో బీకాం పూర్తి చేశారు.
డిగ్రీ తర్వాత 1976లో చెన్నై చేరుకున్నచిరు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమో పూర్తి చేశారు. ఆ తర్వాత నటునిగా ప్రయత్నాలు ప్రారంభించారు.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత జయకృష్ణ చిరంజీవికి తొలిసారిగా పునాదిరాళ్లు సినిమాలో నటించే అవకాశమిచ్చారు.
ఇక్కడ క్లిక్ చేయండి..