AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సెట్‌లో వాళ్లే ఉండాలని ఆదేశం

చెన్నై అన్నా యూనివర్సిటీలో విద్యార్ధిని గ్యాంగ్‌రేప్‌ ఘటనపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి తక్షణ పరిహారంగా రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ బయటి వ్యక్తులకు చేరడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సెట్‌లో వాళ్లే ఉండాలని ఆదేశం
Anna University
Balaraju Goud
|

Updated on: Dec 29, 2024 | 7:43 AM

Share

చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్ధిని సామూహిక లైంగిక దాడి ఘటనపై మద్రాస్‌ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్‌లతో సిట్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ లీక్‌ కావడంపై మద్రాస్‌ హైకోర్టు మండిపడింది. సీక్రెట్‌గా ఉండాల్సిన ఎఫ్‌ఐఆర్‌ 14 మందికి ఎలా చేరిందని న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలికి , ఆమె కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి తక్షణసాయంగా రూ. 25 లక్షలు చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది.

డిసెంబర్ 25వ తేదీన అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో ఉన్న ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌పై బిర్యాని వ్యాపారి క్యాంపస్‌లో అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అంతేకాకుండా తనను తాను కొరడా దెబ్బలు కొట్టుకొని వినూత్నరీతిలో ఆయన నిరసన తెలిపారు. విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడు కోట్టూరుకు చెందిన జ్ఞానశేఖరన్‌గా గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..