AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APAAR: విద్యార్ధులందరికీ అపార్‌ ఐడీ జారీ.. ఆధార్‌లో ఉన్నట్టే పాఠశాల రికార్డుల్లోనూ ఉండాల్సిందే

వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ ఐడీ పేరిట ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీ సంఖ్య జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు విద్యార్ధులకు అపాక్ నంబర్ జారీ చేయగా.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పాఠశాల శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది..

APAAR: విద్యార్ధులందరికీ అపార్‌ ఐడీ జారీ.. ఆధార్‌లో ఉన్నట్టే పాఠశాల రికార్డుల్లోనూ ఉండాల్సిందే
APAAR to students
Srilakshmi C
|

Updated on: Dec 29, 2024 | 7:40 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అపార్‌ ఐడీ జారీ చేస్తుంది. 12 అంకెల అపార్‌ ఐడీ ప్రతి విద్యార్దికీ కేటాయిస్తున్నారు. దీనిని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు. ఈ పథకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 కింద అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆధార్‌ గుర్తింపు కార్డులో ఉన్నట్లే పాఠశాలల రికార్డుల్లోని వివరాలను జనవరి 31వ తేదీలోగా మార్చుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆధార్, పాఠశాల రికార్డుల్లో ఒకే విధంగా విద్యార్థి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలు ఉండేలా చూసుకోవాలి. తొలుత ఆధార్‌లో తప్పులపు సరిచేసుకోవాలి. ఆ తర్వాత పాఠశాలల రికార్డుల్లో మార్చుకోవాలి. ఈ వివరాల ఆధారంగానే అపార్‌ ఐడీ కేటాయిస్తారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7.75 కోట్ల మంది విద్యార్ధులకి అపార్‌ ఐడీ మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 18వ తేదీ వరకు 2.10 లక్షల మంది అంటే కేవలం 3 శాతం మందికి మాత్రమే ఈ ఐడీ కేటాయించారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సూచించారు. వివరాల మార్పులు చేసేందుకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు, మోడల్, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ ఈఓ లేదా డీఈఓలకు ఈ మార్పులు చేసే అధికారం ఇచ్చారు.

అపార్‌ ఐడీ అంటే ఏమిటి?

జాతీయ నూతన విద్యా విధానం-2020భాగంగా కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ ఐడీ పేరిట ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీ సంఖ్య ఇచ్చే ప్రక్రియ. దీనిని 2023లో కేంద్ర సర్కార్‌ ప్రారంభించింది. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఒకటే నంబరు ఉంటుంది. తద్వారా విద్యార్థుల డ్రాపౌట్లు, పాఠశాలలు మారినా, ఒక రాష్ట్రం నుంచి దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా విద్యార్ధి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల సర్టిఫికెట్లు, క్రెడిట్లను నిక్షిప్తం చేసే అకడమిక్‌ బ్యాంకు క్రెడిట్‌ (ఏబీసీ)తో అపార్‌ ఐడీ అనుసంధానమై ఉంటుంది. దానివల్ల సర్టిఫికెట్ల భద్రతకు కూడా ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌