తెలుగు రాష్ట్రాలపై యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు
Cyclone Yaas updates: తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో యాస్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండక పోవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరింత బలపడిన సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని, ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.
ఈ రాత్రి వరకు అల్పపీడనం కాస్తా.. వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26 న ఉదయం ఒడిశా – బెంగాల్ తీరం తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. అదే రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.