Cyclone Yaas Updates: దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న IMD
Cyclone Yaas: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ రాత్రి వరకు అల్పపీడనం కాస్తా.. వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి...
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ రాత్రి వరకు అల్పపీడనం కాస్తా.. వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26 న ఉదయం ఒడిశా – బెంగాల్ తీరం తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. అదే రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
రాబోయే 24 గంటల్లో రాజస్తాన్‌లో చాలా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే మరో మూడు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, చండీగడ్, ఢిల్లీతోపాటు ఉత్తర్ ప్రదేశ్‌లపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీస్తాయని వెల్లడించింది.
Isolated Duststorm also very likely over Rajasthan during next 24 hours. ♦ Strong surface/dust raising winds (25-35 kmph) likely over Rajasthan, Haryana,Chandigarh & Delhi and Uttar Pradesh during next 3 days.@ndmaindia pic.twitter.com/RFRskwSy6w
— India Meteorological Department (@Indiametdept) May 23, 2021
ఇక తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాన్ ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తుపాను దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్న వాతావరణ శాఖ.. జాలర్లు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.