Rajasthan Covid-19: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 345 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
Rajasthan Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సెకండ్‌వేవ్‌లో పిల్లలను సైతం వదలడం లేదు కరోనా..
Rajasthan Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సెకండ్‌వేవ్‌లో పిల్లలను సైతం వదలడం లేదు కరోనా. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే .. మరో వైపు పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో పిల్లలు కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలు వెలువడుతున్నాయి. 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న 345 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ తేలింది. రాష్ట్రంలో దౌసా జిల్లాలో పిల్లలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.
ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత పది రోజుల్లో సుమారు 500లకుపైగా పిల్లలు కోవిడ్ బారిన పడ్డారు. అయితే 2021 మార్చి నుంచి కోవిడ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే కరోనా బారిన పడిన పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రమాదమేమి లేదని అధికారులు తెలిపారు.
అలాగే దుంగార్పూర్ జిల్లాలో పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో కొందరికి పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. అయితే పిల్లలపై కూడా కరోనా పంజా విసరడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతున్నారు. అవసరమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా జిల్లాల అధికారులకు పలు సూచనలు చేసింది. పిల్లల్లో ఏవైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ తేలిన వారిని ఆస్పత్రికి తరలించాలని సూచించింది. ఇప్పుడు పిల్లలపై కూడా కరోనా మహమ్మారి ప్రభావం చూపడంతో భయాందోళన చెందుతున్నారు.
అయితే జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం రాకపోకలు భారీగా సాగుతాయని, దీని వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నామని, మాస్క్‌లు ధరించకుండా బయటకు వచ్చినవారిపై కఠినమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొంటున్నారు.