Assam Encounter: అస్సాంలో ఉగ్రవాదులపై విరుచుకుపడ్డ పోలీసులు.. ఆరుగురు టెర్రరిస్టుల హతం
Assam Encounter: అస్సాం రైఫిల్స్, అస్సాం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఆదివారం డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) కు చెందిన 6 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Assam Encounter: అస్సాం రైఫిల్స్, అస్సాం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఆదివారం డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) కు చెందిన 6 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.. నాగాలాండ్ సరిహద్దులో పశ్చిమ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. డిఎన్‌ఎల్‌ఎ ఉగ్రవాదులు భద్రతా దళాలు ఇక్కడ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. ఈ సందర్భంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కూడా ఎదురుదాడి చేశారు. ఈ ఎదురుదాడిలో 6గురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమార్చిన ఉగ్రవాదుల నుంచి పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి, 4 ఎకె -47 లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భద్రతా దళాల కూంబింగ్ అక్కడ ఇంకా కొనసాగుతోంది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాకు చెందిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎ.ఎస్.పి) ప్రకాష్ సోనోవాల్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీని 2 సంవత్సరాల క్రితం ఉగ్రవాదులు స్థాపించారు. డిమాసా గిరిజనుల కోసం స్వతంత్ర దేశాన్ని సృష్టించాలని కోరుతోంది.
ఈ మిలిటెంట్ సంస్థ అధిపతి పేరు నైసోడావో డిమాసా అలాగే దీని కార్యదర్శి ఖర్మినాడ డిమాసా. ఈ ఉగ్రవాద సంస్థ అస్సాంలోని డిమా హసావో, పశ్చిమ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాల్లో చురుకుగా ఉంది. అంతకుముందు మే 19 న ధన్సిరి ప్రాంతంలో డిఎన్‌ఎల్‌ఎ ఉగ్రవాదులు ఒక యువకుడిని హత్య చేశారు. ఈ సంఘటన తరువాత నుంచి భద్రతా దళాల బృందం ఈ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తూ వస్తోంది.
Also Read: Sushil Kumar: హత్య కేసులో.. ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..! ఎక్కడ పట్టుబడ్డాడంటే..?
IMA on Baba Ramdev: మెడికల్ అసోసియేషన్ సీరియస్.. రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు..