IMA on Baba Ramdev: మెడికల్ అసోసియేషన్ సీరియస్.. రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు..
IMA on Baba Ramdev - Allopathy : ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై
IMA on Baba Ramdev – Allopathy : ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సీరియస్ అయ్యింది. ఈ మేరకు రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు పంపింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని లీగల్ నోటీసులో పేర్కొంది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని బాబా రాందేవ్ చెబుతున్నారంటూ అంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింద.ి దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఐఎంఏ తీవ్రంగా విమర్శించింది.
అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా రాందేవ్ బాబా మాట్లాడారని ఐఎంఏ పేర్కొంది. రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్రానికి స్పష్టంచేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఇండియన్ మెడికల్ సోసియేషన్ హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది.
అల్లోపతి (ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం) వైద్యంపై యోగా గురు రాందేవ్ బాబా పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమంటూ పేర్కొన్నారు. ఆ వైద్య విధానం పని చేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయంటూ రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read: