Silver Price Today: దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో..
Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. వెండి, పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాగా.. బంగారం, వెండి ధరల్లో నిత్యం
Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. వెండి, పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాగా.. బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతుంటాయి. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. ఆదివారం కూడా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతటా.. కిలో వెండికి 100 రూపాయల మేర తగ్గింది. కాగా.. ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం రూ.700 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,100 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,100 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700 ఉంది. ఇక్కడా, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.71,100 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,700 లు ఉంది. విజయవాడలో వెండి రూ.75,700 వద్ద కొనసాగుతోంది. కాగా.. దక్షిణాది నగరాల్లోనే ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
Also Read: