AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేస్తాం… కీలక ప్రకటన చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

chevireddy bhaskar reddy: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన  మొదలు పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగం పరిశీలన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ...

టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేస్తాం... కీలక ప్రకటన చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
Ttd Anandayya.jpg 1
Sanjay Kasula
|

Updated on: May 23, 2021 | 12:19 PM

Share

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన  మొదలు పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగం పరిశీలన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ… టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఐసీఎంఆర్ (ICMR)అధ్యయనంలో సానుకూల ఫలితాలు వస్తే ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారుచేయవచ్చునని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడినట్లుగా సమాచారం. అయితే తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ప్రకటించారు. శనివారం (మే 22) టీటీడీ ఆయుర్వేద విభాగం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో కలిసి కృష్ణపట్నం గ్రామాన్ని చెవిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై క్షేత్ర స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదిలావుంటే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని..,దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని… కాబట్టి ఇది హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్‌లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. శనివారం(మే 22) ఆయుష్ ప్రతినిధుల బృందం ఆనందయ్య మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించింది.

వంశపారపర్యంగా ఇస్తున్నారు… ఆనందయ్య మందును పరిశీలించడానికి ముందే ల్యాబ్‌లో దాని నమూనాలను పరిశీలించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. వంశపారంపర్యంగా ఆయన మందులు ఇస్తున్నారని… ఇప్పుడు కరోనా పేరుతో ఇస్తున్న మందు కూడా నాటు మందేనని తెలిపారు. ఈ మందు వినియోగంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి:  Black Gram: మినుములు తింటే.. ఇనుమంత బలం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Covaxin: మీరు కోవ్యాక్సిన్ వాక్సిన్ తీసుకున్నారా?.. అయితే మీకో బ్యాడ్ న్యూస్..