AP Telangana Borders: పాస్ ప‌రేషాన్.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ల‌లో లొల్లి.. లొల్లి.

కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో​ కఠినంగా లాక్​డౌన్ అమలుచేస్తుంది. పోలీసులు అకార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

AP Telangana Borders:  పాస్ ప‌రేషాన్.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ల‌లో లొల్లి.. లొల్లి.
Ap Telangana Borders
Follow us
Ram Naramaneni

|

Updated on: May 23, 2021 | 11:25 AM

కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో​ కఠినంగా లాక్​డౌన్ అమలుచేస్తుంది. పోలీసులు అకార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ-పాస్‌ ఉన్నవారినే తెలంగాణ‌లోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద, జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద.. ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్​లు లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. మరోవైపు సరకు రవాణా వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద ఏపీ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. కొవిడ్ క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ సూర్యపేట జిల్లా సరిహద్దులో ఆదివారం నుంచి ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామన్నారు. మఠంపల్లి, పులిచింతల, రామాపురం గ్రామ చెక్‌పోస్టులు మూసివేశారు.

Also Read: మీరు కోవ్యాక్సిన్ వాక్సిన్ తీసుకున్నారా?.. అయితే మీకో బ్యాడ్ న్యూస్..

బంపర్ ఆఫర్.. రూ.9 కే గ్యాస్ సిలిండర్.. ఎలా సొంతం చేసుకోవాలంటే..?