AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender Son: ఈటెల రాజేందర్ త‌న‌యుడిపై భూమి కబ్జా ఆరోప‌ణ‌లు.. తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సీఎం ఆదేశం

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మాసాయిపేట మండలం...

Etela Rajender Son: ఈటెల రాజేందర్ త‌న‌యుడిపై భూమి కబ్జా ఆరోప‌ణ‌లు.. తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సీఎం ఆదేశం
Etela Rajender
Ram Naramaneni
|

Updated on: May 23, 2021 | 11:45 AM

Share

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలతో మొదలైన వివాదం షామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్‌లో సీతారామ దేవాలయం భూముల వరకు వెళ్లింది. ఈ రెండు భూ వివాదాలపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. అయితే ఆ వివాదం అలా కొనసాగుతుండగానే ఈటల భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు తో కూడిన దరఖాస్తు చేశారు.

ఇక తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Also Read: పాస్ ప‌రేషాన్.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ల‌లో లొల్లి.. లొల్లి.

ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ