Police brutality : పోలీసుల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ ఉండటం లేదంటోన్న జనాలు, మనుషులను గొడ్లను బాదినట్లు బాదుతున్నారంటూ ఆగ్రహం
police brutality at lockdown time : లాక్ డౌన్ వేళ పోలీసుల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ ఉండటం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు...
police brutality at lockdown time : లాక్ డౌన్ వేళ పోలీసుల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ ఉండటం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మనుషులను గొడ్లను బాదినట్లు బాదుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వేళ పోలీసులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల్ని తీవ్రంగా కొడుతోన్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొంత మంది పోలీసుల పైశాచికం బయటపడింది. దుగ్గొండి మండలం జర్నిబావి వద్ద ముజాహిద్ అనే వ్యక్తిని కర్రలతో చితకబాదారు పోలీసులు. దీంతో అతని ఒళ్ళంతా వాతలు తేలాయి. ఉదయం గం. 9.45 కు పాలప్యాకెట్ కోసం వెళ్లినతనను పోలీసులు కర్రలతో ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టారని బాధితుడు వాపోయాడు. మరోవైపు, కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద ఓ SI అతి ఉత్సాహం ప్రదర్శించాడు. ఆసుపత్రికి వెళ్లి వస్తున్న వ్యక్తిని చితకబాదాడు. ఈ ఘటనల పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.