Vaccination In UK: బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. భారత్ వ్యాక్సిన్ ఎగుమతిని తగ్గించడమే కారణం..
Vaccination In UK: ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రపంచదేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా దేశాలకు భారత్‌లో తయారవుతోన్న వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నారు. దీంతో...
Vaccination In UK: ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రపంచదేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా దేశాలకు భారత్‌లో తయారవుతోన్న వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నారు. దీంతో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే బ్రిటన్‌కు కూడా భారత్‌లో తయారు చేస్తోన్న ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో ఈ సరఫరా తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని వారాల క్రితం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారత్ నుంచి బ్రిటన్‌కు 50 లక్షలు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఈ సరఫరా రానున్న రోజుల్లో తగ్గిపోనుందని సమాచారం. వచ్చే నెలలో ఊహించినదానికంటే తక్కువగా వ్యాక్సిన్ ఎగుమతి జరగనున్నట్లు బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ బుధవారం తమ దేశంలోని ఆరోగ్య సంస్థలకు ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే దీనికి గల కారణమేంటనే విషయాన్ని గమనిస్తే.. భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై నాలుగు వారాల పాటు వ్యాక్సిన్ ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా చాలా మిగిలి ఉండడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ పార్లమెంట్ సాక్షిగా తెలిపాడు. అయితే వ్యాక్సిన్ దిగుమతి నెమ్మదించినప్పటికీ తమ దేశంలొని పెద్దలందరికీ జూలై చివరి నాటికి ఇస్తామని మాట్ హాన్కాక్ తెలిపారు. ఇదిలా ఉంటే యూకేలో ఇప్పటి వరకు 25 మిలియన్లకు పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా, 1.7 మిలియన్ల మందికి సెకండ్ డోస్ ఇచ్చారు. ఇక భారత్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎగుమతి విషయంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కంపెనీ సీఈఓ అదార్ పూనావాలా గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచనలు ఇచ్చామని. అలాగే ప్రపంచ దేశాలకు ఎగుమతిని కూడా బ్యాలెన్స్ చేస్తామని. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఓపికతో ఉండాలని పూనావాలా గతంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.