రెండు రోజులు ‘ఆర్ఆర్ఆర్’ ట్రయల్ షూట్.. డూప్‌లతో..?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌తో గత మూడు నెలలుగా సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే పలు సీరియల్, సినిమా షూటింగ్స్ షురూ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌తో గత మూడు నెలలుగా సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే పలు సీరియల్, సినిమా షూటింగ్స్ షురూ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. రాజమౌళి దర్మకత్వంలో ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే కదా. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే చాలా రోజుల తర్వాత ఈ ప్రాజెక్టు మళ్లీ సెట్స్‌పైకి వెళ్లింది. రెండు నెలలకు పైగా విరామం తర్వాత 2 రోజుల పాటు ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్‌ను నిర్వహించనుంది చిత్రయూనిట్.
గండిపేటకు సమీపంలో వేసిన సెట్స్‌లో లేదా సిటీ సరిహద్దుల్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు రోజులు ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. సోమ, మంగళ వారాల్లో షూటింగ్‌కి సంబంధించిన నియమనిబంధనల ప్రకారం జక్కన్న స్టార్ హీరోలిద్దరి డూప్స్‌తో షూటింగ్‌కు ప్లాన్ చేసినట్లు సమాచారం. ట్రయల్ షూట్‌లో మొత్తం 50 మంది పాల్గొననున్నారట. ఈ రెండు రోజుల షూటింగ్‌లో రాజమౌళి అండ్ టీం షూటింగ్ ఎలా చేయవచ్చో ట్రయల్ నిర్వహిస్తారట.
Read More:
కాణిపాక ఆలయంలో కరోనా కలకలం.. హోమ్ గార్డ్‌కి పాజిటివ్..
బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..