మీ దగ్గర శానిటైజర్ లేదా.. అయితే రాచకొండ పోలీసుల టిప్స్ ఫాలోకండి..
ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఎప్పటికప్పుడు శుభ్రతను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో మనదేశంలో కూడా చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తోంది. ఇందులో అన్ని డిపార్ట్‌మెంట్లు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ముందు వరుసలో రాచకొండ పోలీసులు ముందువరుసలో ఉన్నారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ.. […]

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఎప్పటికప్పుడు శుభ్రతను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో మనదేశంలో కూడా చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తోంది. ఇందులో అన్ని డిపార్ట్‌మెంట్లు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ముందు వరుసలో రాచకొండ పోలీసులు ముందువరుసలో ఉన్నారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్త్రృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
కరోనా వైరస్ బారిన పడకుండా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో క్షుణ్ణంగా తెలుపుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ సమయాన్ని కూడా వీరు.. ప్రజల్లో కరోనా గురించి అవగాహన కల్పించేందుకు ఉపయోగిస్తున్నారు. రోడ్డుపైనే నిలబడి.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. మన చేతులు ఎలా కడుక్కోవాలో అన్నదాని గురించి ప్రాక్టికల్‌గా వివరించి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో శానిటైజర్ లేనిపక్షంలో ఎలా చేతులు కడుక్కోవాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రాచకొండ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌లో ఓ వీడియో లింకును పోస్ట్ చేశారు. ఈ వీడియోలో శానిటైజర్ లేని సమయంలో.. సబ్బుతో చేతులు కడుక్కోవచ్చని.. చెప్తూ.. శానిటైజర్ లేనిపక్షంలో సబ్బును వెంటపెట్టుకుని సూచిస్తున్నారు.
This video explains how soap kills Corona virus. శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను వెనుక ముందు కడుక్కోవటం మరువొద్దు. #Public_health_emergency https://t.co/Vw3ppQpEvV
— Rachakonda Police (@RachakondaCop) March 21, 2020