Vaccination: ఈ రాష్ట్రాలలో 100 శాతం టీకాలు వేయడం పూర్తి..! మీ రాష్ట్రం ఇందులో ఉందా..?
Vaccination: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. చాలామంది వ్యాక్సిన్ మాత్రమే ఈ సంక్షోభం నుంచి కాపాడగలదని నమ్ముతున్నారు. దీంతో దేశంలో
Vaccination: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. చాలామంది వ్యాక్సిన్ మాత్రమే ఈ సంక్షోభం నుంచి కాపాడగలదని నమ్ముతున్నారు. దీంతో దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.అయితే కొన్ని రాష్ట్రాలలో టీకాలకు సంబంధించి సమస్య ఇంకా కొనసాగుతోంది. వ్యాక్సిన్ కేంద్రాలలో పొడవాటి లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో మాత్రం టీకాల పని చాలా వేగవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రాలలో 100 శాతం వరకు టీకాలు వేయడం పూర్తయింది. అంటే మొదటి డోస్ అందరికి వచ్చిందన్నమాట.
ఏ రాష్ట్రాలు 100% టీకాలు పొందాయి? ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాలలో 100 శాతం టీకాలు వేసే ప్రక్రియ పూర్తయింది. మొదటగా హిమాచల్ ప్రదేశ్ లో ఈ పని పూర్తయింది. ఇక్కడి ప్రజలందరూ మొదటి డోసు పొందారు. తర్వాత సిక్కిం కూడా ఈ లిస్టులో చేరింది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలైన దాదర్ నగర్ హవేలి, లడక్, చండీగఢ్ రాష్ట్రాలలో మొదటి డోసు పూర్తయింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలలో మాత్రమే 100 శాతం టీకాలు ప్రక్రియ పూర్తయింది. అయితే తాజాగా గోవా రాష్ట్రం కూడా ఇందులో చేరింది.
ఇటీవల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దీని గురించి ప్రకటించారు. అక్టోబర్ 30 లోపు రెండో టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి సాయిజలి మాట్లాడుతూ.. నవంబర్ 30 లోపు ప్రజలందరికి రెండో డోసు పూర్తి చేయడం మా లక్ష్యం అని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో అందుబాటులో లేని ప్రదేశాలకు ఆరోగ్య కార్యకర్తలు వెళ్లేందుకు హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. దీని కారణంగా అక్కడ టీకా ప్రక్రియ సులువుగా జరిగింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలు ఈ లిస్టులో చేరనున్నాయి.