Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద… ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. బిక్కుబిక్కుమంటున్న ముంపుగ్రామాలు

Godavari Floods: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదవారి జిల్లా రాజమహేంద్రవరం...

Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద...  ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. బిక్కుబిక్కుమంటున్న ముంపుగ్రామాలు
Godavari Floods
Follow us

|

Updated on: Sep 10, 2021 | 2:31 PM

Godavari Floods: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదవారి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో విపత్తుల శాఖ కమిషనర్ కె . కన్నబాబు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాదు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో ని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది. ఇక రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి మరికొంత పెరిగి తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read:

ఒకే దిశలో నాలుగు రైళ్లు.. వాహ్ అంటూ ఆశ్చర్యపోతోన్న జనం.. వైరలవుతోన్న వీడియో

ఈ పబ్‌లో దెయ్యం ఉంది.. కావాలంటే మీరే చూడండి..