Pregnency: గర్భధారణ ఇప్పుడు వద్దు.. నవ దంపతులకు ఆ దేశం ప్రత్యేక వినతి

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయడం చాలా దేశాలకు కష్టతరంగా మారుతోంది.

Pregnency: గర్భధారణ ఇప్పుడు వద్దు.. నవ దంపతులకు ఆ దేశం ప్రత్యేక వినతి
Pregnancy
Follow us

|

Updated on: Sep 10, 2021 | 9:05 PM

Sri Lanka Covid News: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయడం చాలా దేశాలకు కష్టతరంగా మారుతోంది. ఇటు భారత్‌కు పొరుగుదేశమైన శ్రీలంకలోనూ డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. శ్రీలంకలో స్థానిక సంవత్సరాది వేడుకల నిమిత్తం ఏప్రిల్ మూడో వారంలో ప్రజా రవాణా ఆంక్షలు సడలించగా.. అప్పటి నుంచి నిత్యం భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఓ రకంగా అప్పటి నుంచే ఆ దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలయ్యింది. మే మాసంలో ఓ గర్భిణి మహిళ కోవిడ్ బారినపడి మృత్యువాతపడగా.. అప్పటి నుంచి గత నాలుగు మాసాల్లో 42 మంది గర్భిణీ మహిళలు మరణించారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో పిల్లల కోసం ప్రయత్నిస్తున్న నవ దంపతులకు శ్రీలంక ప్రభుత్వం కీలక సూచన చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గర్భధారణ ఆలోచనను కనీసం సంవత్సర కాలంపాటు వాయిదావేసుకోవాలని ఆ దేశ ఆరోగ్య శాఖ కోరింది.

సాధారణంగా శ్రీలంకలో ఏటా 90 నుంచి 100 మంది గర్భిణి మహిళలు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తుంటారు. అయితే థర్డ్ వేవ్ కారణంగానే గత 4 మాసాల్లో 41 మంది గర్భిణీలు కరోనా వైరస్ సోకి మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వ హెల్త్ ప్రమోషన్ బ్యూరో డైరెక్టర్ చిత్రమలి డిసిల్వా తెలిపారు. తమ దేశంలో 5,500 మంది గర్భిణీలు కరోనా బారినపడగా.. వీరిలో 70 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేట్ అయినవారుగా వెల్లడించారు. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న నవ దంపతులు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఇతరులు తమ ప్రయత్నాలను కనీసం ఒక సంవత్సరం పాటు వాయిదావేసుకోవాలని ప్రభుత్వ గైనకాలజిస్ట్ హర్ష ఆటపట్టు సూచించారు.

2.1 కోట్ల జనాభా కలిగిన శ్రీలంకలో ఇప్పటి వరకు 4,75,000 కరోనా కేసులు నమోదుకాగా… 10,500 మంది కరోనా మహమ్మారి బారినపడి మరణించారు. అయితే వాస్తవిక కరోనా కేసులు, మృతుల సంఖ్య.. ప్రభుత్వం చెబుతున్న సంఖ్య కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read..

Asteroids: భూమికి అతి దగ్గరగా వచ్చిన 1000వ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా..

గుప్త నిధుల కోసం దుండగుల వేట.. బయటపడ్డ అరుదైన మూషికా విగ్రహం.. ఇంతకీ ఏంచేశారంటే..?

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.