వారికి కరోనా వస్తే మరణ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
Covid Risk: దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిలో పొలాండ్ శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన
Covid Risk: దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిలో పొలాండ్ శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించారు. కొంతమందిలో కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదం రెట్టింపు ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పొలాండ్ శాస్త్రవేత్తలు వైరస్‌ని పెంచి పోషించే ఒక రకమైన జన్యువుని కనుగొన్నారు. ఈ జన్యువు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధన వల్ల వైద్యులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.
పోలాండ్‌లోని బియాలిస్టాక్‌లోని మెడికల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల పరిశోధనలో ఈ విషయాలను కనుగొన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ పరిశోధన ఫలితాలు వైరస్‌తో పోరాడడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ఉదాహరణకు జన్యువుల ఆధారంగా కోవిడ్-19 రిస్క్ జోన్‌లో ఎక్కువగా ఉన్న రోగులను వైద్యులు త్వరగా గుర్తించగలరు. పోలాండ్‌లోని 1500 మంది రోగులపై పరిశోధన చేసిన తర్వాత ఈ ఫలితాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన ప్రకారం.. భారతదేశంలో 27 శాతం మంది ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
పరిశోధకుడు మార్సిన్ మోనియుజ్కో ప్రకారం.. “ఇన్ఫెక్షన్ తర్వాత రోగి పరిస్థితిని క్లిష్టతరం చేసే జన్యువును మేము గుర్తించారం. పోలాండ్‌లో ఇటువంటి జన్యువు కలవారు 14 శాతం మంది ఉన్నారు. అదే సమయంలో, భారతదేశంలో 27 శాతం మంది ఈ జన్యువుని కలిగినవారు ఉన్నారని అంచనా. అంటే ఈ వ్యక్తులకు కరోనా వస్తే పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంటుంది” అని చెప్పాడు. మరణ ప్రమాదాన్ని తగ్గించడానికి రోగులకు జన్యు పరీక్ష చేయవచ్చు. దీని నుంచి వచ్చే నివేదిక ద్వారా నిర్దిష్ట రకమైన జన్యువు ఏ రోగులలో ఉందో కనుగొనవచ్చు.
ఇన్ఫెక్షన్ మరింత పెరగకముందే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ రోగిని రక్షించే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు వివరించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మధ్య, తూర్పు ఐరోపాలోని ప్రజలు టీకాను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా మరణాల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం. నిర్దిష్ట జన్యువులు ఉన్నవారికి టీకాలు ఇవ్వడం లేదా ఇన్ఫెక్షన్ సంభవించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన ప్రమాదాలను తగ్గించవచ్చు.