- Telugu News Photo Gallery Viral photos Amazing facts about jonathan tortoise who is oldest creature on earth
Viral Photos: ఇది భూమిపై ఎక్కువ కాలం బతికే జీవి.. వయస్సు తెలిస్తే షాక్ అవుతారు..?
Viral Photos: భూమిపై చాలా జంతువులు ఉంటాయి. కానీ తాబేలు మాత్రమే ఎక్కువ కాలం జీవిస్తుంది. అయితే ప్రపంచంలోనే అధిక వయసున్న
Updated on: Jan 16, 2022 | 10:39 AM

భూమిపై చాలా జంతువులు ఉంటాయి. కానీ తాబేలు మాత్రమే ఎక్కువ కాలం జీవిస్తుంది. అయితే ప్రపంచంలోనే అధిక వయసున్న తాబేలు ఎక్కుడుందో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన తాబేలు జోనాథన్. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన జీవిగా రికార్డు సాధించింది. దీని కాలం నిర్దారించడంలో శాస్త్రవేత్తలు కూడా అయోమయంలో ఉన్నారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపంలో నివసిస్తున్న జోనాథన్ వయస్సు కారణంగా వార్తల్లో నిలిచింది.

మీడియా నివేదికల ప్రకారం.. జోనాథన్ 1832లో జన్మించినట్లు చెబుతున్నారు. కాబట్టి 2022 సంవత్సరంలో అతనికి 190 ఏళ్లు నిండుతున్నాయని తెలుస్తోంది.

జోనాథన్‌ను 1882లో సెయింట్ హెలెనాకు తీసుకువచ్చినప్పుడు దాని వయస్సు 50 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు 190 సంవత్సరాలు

జోనాథన్ అనే ఈ తాబేలు అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటీష్ ఓవర్సీస్ భూభాగం అయిన సెయింట్ హెలెనాలో నివసిస్తుంది. జోనాథన్ సన్ బాత్ చేయడానికి ఇష్టపడుతుంది. కానీ వేడి రోజులలో బయటికి రాదు. క్యాబేజీ, దోసకాయ, క్యారెట్, ఆపిల్, అరటి, పాలకూర, సీజన్ పండ్లు అంటే ఇష్టంగా తింటుంది.



