గుడ్‌న్యూస్‌.. కరోనా ముక్త్ దిశగా మరో రాష్ట్రం.. రీజన్ ఇదే..

గుడ్‌న్యూస్‌.. కరోనా ముక్త్ దిశగా మరో రాష్ట్రం.. రీజన్ ఇదే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు వేల సంఖ్యల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేల దిశగా వెళ్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పన్నెండు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ కేసుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నమోదవుతున్నాయి. తరువాతి స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తో సహా పలు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 7:06 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు వేల సంఖ్యల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేల దిశగా వెళ్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పన్నెండు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ కేసుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నమోదవుతున్నాయి. తరువాతి స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే  కొన్ని రాష్ట్రాలు కరోనా ఫ్రీగా మారాయి. ఈ రాష్ట్రాల జాబితాలోకి త్వరలో కేరళ కూడా చేరనుంది. తాజాగా బుధవారం నాడు కేరళ రాష్ట్రంలోని కరోనా కేసుల వివరాలను సీఎం పినరయ్  విజయన్ తెలిపారు. బుధవారం నాడు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇవాళ కరోనా నుంచి కోలుకుని మరో ఏడుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం కేవలం 30 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఇక బుధవారం నాడు కోలుకున్న వారిలో కొట్టాయం, పాతనమిట్ట జిల్లాల వారు కూడా ఉన్నారు. వీరు కరోనా నుంచి బయటపడటంతో.. ఇప్పుడు కేరళలో మొత్తం ఎనిమిది జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. కొట్టాయం, పాతనమిట్ట, కొజికొడ్‌, మలప్పురం, త్రిసూరు, ఎర్నాకులం, అలప్పుజ, తిరువనంతపురం జిల్లాలు ఇప్పుడు కరోనా ఫ్రీ జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu