మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్‌కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు..

  • Tv9 Telugu
  • Publish Date - 7:02 pm, Wed, 6 May 20
మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రజలకు రూ.15 వందల నగదుతో పాటు ఉచిత బియ్యాన్ని కూడా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ నగదు తమకు బ్యాంకుల్లో పడటం లేదంటూ.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం వివరాలు, సమస్యల పరిష్కారం కోసం ఓ టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది.

తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్‌కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. ఆర్థిక సాయం కోసం 040 23314614 నెంబర్‌కి చేయాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఈ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే.. ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్‌ను కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.

కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా రోజువారీగా పనులకు వెళ్లేవారు మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదాలందరికీ రూ.15 వందల నగదు అందిస్తోంది.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్