కరోనా లాక్ డౌన్: కర్ణాటక సీఎంకు చంద్రబాబు లేఖ

Chandrababu : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయడంతో పాటు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. కాగా.. కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారని […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:09 pm, Wed, 6 May 20
కరోనా లాక్ డౌన్: కర్ణాటక సీఎంకు చంద్రబాబు లేఖ

Chandrababu : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయడంతో పాటు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు.

కాగా.. కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారని చంద్రబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారు స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని యడియూరప్పను కోరారు. అలా కుదరని పక్షంలో వారికి అవసరమైన ఆహారం, వసతి ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.