AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజా రవాణాకు త్వరలో అనుమతి… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

దేశంలో లాక్ డౌన్ విధించినప్పటినుంచీ స్తంభించిపోయిన ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్) ను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే కొన్ని ఆంక్షలు ఉంటాయన్నారు. బుధవారం బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కొన్ని గైడ్ లైన్స్ తో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును త్వరలో అనుమతిస్తామని, అయితే వాహనాలను నడిపేటప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని […]

ప్రజా రవాణాకు త్వరలో అనుమతి... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Umakanth Rao
| Edited By: |

Updated on: May 06, 2020 | 6:19 PM

Share

దేశంలో లాక్ డౌన్ విధించినప్పటినుంచీ స్తంభించిపోయిన ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్) ను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే కొన్ని ఆంక్షలు ఉంటాయన్నారు. బుధవారం బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కొన్ని గైడ్ లైన్స్ తో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును త్వరలో అనుమతిస్తామని, అయితే వాహనాలను నడిపేటప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ఈ నెల 17 వరకు కొనసాగనుంది. అయితే తెలంగాణాలో 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అటు-ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ జోన్లలో అనేక ఆంక్షలను సడలించింది. పారిశ్రామిక సెక్టార్లు మళ్ళీ కళకళ లాడడం ప్రారంభించాయి. షాపులు తెరుచుకున్నాయి.

Follow Us