AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకు రూ.94 లక్షల ఖర్చు! కట్‌చేస్తే..

వృద్ధాప్యాన్ని అడ్డుకోవడానికి ఒక మహిళ చేసిన విపరీతమైన ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యవ్వనంగా కనిపించడం కోసం ఆమె ఏకంగా రూ.94 లక్షలు ($1,13,000 కంటే ఎక్కువ) ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. ఈ సర్జరీల తర్వాత ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. వృద్ధాప్యాన్ని జయించడానికి టెక్నాలజీని వాడుకోవడం నేటి కాలంలో ఒక ట్రెండ్‌గా మారుతోందని ఈ మహిళ కథ మరోసారి రుజువు చేసింది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూద్దాం..

50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకు రూ.94 లక్షల ఖర్చు! కట్‌చేస్తే..
Botox Injections Results
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2026 | 6:00 PM

Share

వయసు పెరగడం అనేది ప్రకృతి సహజం. కానీ, ఆ వృద్ధాప్యాన్ని అడ్డుకుని ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని ఎవరికి ఉండదు? సరిగ్గా అలాంటి ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన జెన్ ప్లాంక్ అనే మహిళ. ఆమె తన నిత్యయవ్వనం కోరికను నిజం చేసుకోవడానికి ఏకంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జెన్ ప్లాంక్ తన 40వ ఏట నుండి ఈ మేకోవర్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ముఖంపై ముడతలు రాకుండా ఉండటానికి నిరంతరం బోటాక్స్ ఇంజెక్షన్లు తీసుకోవడం దగ్గర నుండి, ముఖ చర్మాన్ని టైట్‌గా ఉంచే ‘ఫేస్ లిఫ్ట్’ సర్జరీ వరకు ఆమె వెనక్కి తగ్గలేదు. మొత్తం మీద ఆమె తన రూపం కోసం రూ.94 లక్షలకు పైగా వెచ్చించారు.

ఫలితం ఎలా ఉందంటే..

సర్జరీల తర్వాత ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. 50 ఏళ్ల వయసులో కూడా ఆమె చర్మం ఎంతో కాంతివంతంగా, ఎటువంటి ముడతలు లేకుండా ఉండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె ఫోటోలు చూసిన వారు ఈమెకు 50 ఏళ్లంటే ఎవరూ నమ్మరు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే, ఆమెపై విమర్శలు కూడా వస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల ద్వారా అందాన్ని పెంచుకోవడం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ, జెన్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. నేను నా డబ్బును నా సంతోషం కోసం ఖర్చు చేస్తున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంది అని ఆమె ధీమాగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నేటి ఆధునిక కాలంలో బయో హాకింగ్, యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. జెన్ ప్లాంక్ ఉదంతం అందం పట్ల మనుషులకు ఉన్న మక్కువను, అందుకోసం వారు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ