తమిళనాడులో బయటపడ్డ 700ఏళ్లనాటి నిధి..! ఈ చిన్న పెట్టెలో ఉంది సైన్స్‌కు కూడా అందని సంపద!!
భారతదేశం ప్రాచీన కాలంలోనే విజ్ఞానశాస్త్రంలో ఎంతో ముందంజలో ఉందని నిరూపించడానికి మరో అద్భుతమైన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మైలదుత్తురై (Mayiladuthurai) ప్రాంతంలో బయటపడిన ఒక అద్భుతమైన వస్తువు ఇప్పుడు శాస్త్రవేత్తలను, చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు 700 సంవత్సరాల క్రితం నాటి ఒక చిన్న పెట్టె, అది తట్టుకునే ఉష్ణోగ్రత, దాని తయారీ వెనుక ఉన్న లోహశాస్త్రం (Metallurgy) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ చిన్న పెట్టె ఇప్పుడు ఆధునిక సైన్స్‌కు సైతం సవాలు విసురుతోంది.

తమిళనాడులోని ఒక గ్రామంలో అమీనుల్లా అనే వ్యక్తి కుటుంబం ఏడు తరాలుగా ఒక చిన్న పెట్టెను భద్రపరుస్తోంది. కేవలం 1.5 అంగుళాల పరిమాణం ఉన్న ఈ పెట్టెలో అరచేతిలో ఇమిడిపోయే ఒక పురాతన ఖురాన్ గ్రంథం ఉంది. అయితే, ఖురాన్ కంటే దానిని భద్రపరిచిన పెట్టె శాస్త్రవేత్తలను అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం ఒకటిన్నర అంగుళాల పొడవు, వెడల్పు ఉన్న ఈ లోహపు పెట్టెలో ఒక చిన్న ఖురాన్ గ్రంథం ఉంది. ఈ గ్రంథం సుమారు 700 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. ఈ పెట్టెపై శాస్త్రవేత్తలు నిర్వహించిన పరీక్షలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. ఇది కేవలం ఒక మతపరమైన నిధిగానే కాకుండా, విజ్ఞాన శాస్త్రానికి ఒక పెద్ద రహస్యంగా కూడా నిలిచింది.
ఈ పెట్టె సుమారు 2,600°C ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. ఇది ఇనుము కరిగే ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని తయారీలో బంగారం, వెండి మాత్రమే కాకుండా సుమారు 78 రకాల లోహాలను ఉపయోగించినట్లు గుర్తించారు. ఒక ప్రయోగంలో భాగంగా ఈ పెట్టెను 2,500°C వేడిలో ఉంచినప్పటికీ, అది కరగలేదు సదా లోపల ఉన్న కాగితపు గ్రంథం కనీసం వేడెక్కలేదని సమాచారం. దీనిని బట్టి ఈ పెట్టె అద్భుతమైన హీట్ ఇన్సులేటర్‌గా పనిచేస్తుందని స్పష్టమవుతోంది.
నేడు రాకెట్లు, అంతరిక్ష నౌకల తయారీలో వాడే సిరామిక్ టైల్స్ లేదా ప్రత్యేక లోహ మిశ్రమాల కంటే ఈ పురాతన పెట్టె తయారీ టెక్నాలజీ ఎంతో ఉన్నతమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ కాలంలోనే ఇంతటి సంక్లిష్టమైన లోహ ప్రక్రియను ఎలా చేపట్టారనేది ఇప్పుడు ఒక రహస్యంగా మారింది.ఈ అద్భుత పెట్టె తయారీలో వాడిన లోహాల మిశ్రమం మరియు ఆనాటి సాంకేతికతపై ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ పెట్టె కేవలం ఒక మతపరమైన వస్తువు మాత్రమే కాదు, భారతదేశం గొప్ప వైజ్ఞానిక వారసత్వానికి చిహ్నం. ఇలాంటి ప్రాచీన సాంకేతికతను వెలికితీయడం ద్వారా భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




