AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఏడవసారి నిలిచిన ఫిన్లాండ్ (Finland), పర్యాటకుల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటిస్తోంది. ఆ దేశం సంతోష రహస్యాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఉచిత పర్యటన (Free Trip) ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పర్యాటకులకు 7 రోజుల పాటు ఫిన్లాండ్‌లో ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఫిన్నిష్ ప్రజల జీవనశైలి, ప్రకృతితో వారికున్న అనుబంధం, వారి సంతోషానికి గల రహస్యాలను నేరుగా నేర్చుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో చూడండి!

Jyothi Gadda
|

Updated on: Mar 23, 2026 | 4:58 PM

Share
సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి మీరు ఫిన్లాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న ఫిన్లాండ్, ఇప్పుడు విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిన్లాండ్ దేశం తన అధికారిక పర్యాటక విభాగం 'విజిట్ ఫిన్లాండ్' (Visit Finland) ద్వారా ఒక ప్రత్యేకమైన మాస్టర్ క్లాస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పర్యాటకులకు 7 రోజుల పాటు ఫిన్లాండ్‌లో ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఫిన్నిష్ ప్రజల జీవనశైలి, ప్రకృతితో వారికున్న అనుబంధం, వారి సంతోషానికి గల రహస్యాలను నేరుగా నేర్చుకోవచ్చు.

1 / 5
ఏమిటి ఈ ఆఫర్?: ఫిన్లాండ్ ప్రభుత్వం 'హ్యాపీనెస్ మాస్టర్ క్లాస్' (Happiness Masterclass) పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారు ఫిన్లాండ్‌లోని హెల్సింకి నగరంలో ఒక వారం పాటు ఉచితంగా గడపవచ్చు. అక్కడ నివసించే నిపుణులు మీకు సంతోషంగా ఉండే మార్గాలను, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను నేర్పిస్తారు.

2 / 5
ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?: ఈ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 ఏళ్లు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 'విజిట్ ఫిన్లాండ్' వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫారమ్ పూర్తి చేయాలి.
ముఖ్యంగా, ఇన్‌స్టాగ్రామ్ లేదా టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఒక వీడియో ఛాలెంజ్‌ను పూర్తి చేయాలి. మీరు సంతోషాన్ని ఎలా నిర్వచిస్తారు. ఫిన్లాండ్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే అంశాలను అందులో వివరించాలి.

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?: ఈ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 ఏళ్లు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 'విజిట్ ఫిన్లాండ్' వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫారమ్ పూర్తి చేయాలి. ముఖ్యంగా, ఇన్‌స్టాగ్రామ్ లేదా టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఒక వీడియో ఛాలెంజ్‌ను పూర్తి చేయాలి. మీరు సంతోషాన్ని ఎలా నిర్వచిస్తారు. ఫిన్లాండ్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే అంశాలను అందులో వివరించాలి.

3 / 5
ఉచితంగా లభించే సదుపాయాలు: ఎంపికైన అదృష్టవంతులకు ఫిన్లాండ్ వెళ్లడానికి విమాన టికెట్లు, అక్కడ విలాసవంతమైన వసతి, రుచికరమైన ఆహారం, శిక్షణ తరగతులు అన్నీ ఉచితంగా లభిస్తాయి. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

4 / 5
నేటి బిజీ లైఫ్ నుండి విరామం తీసుకుని, ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాన్ని చూడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి గడువు తక్కువగా ఉన్నందున, వెంటనే ప్రయత్నించడం ఉత్తమం.

5 / 5
Follow Us