AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా ఒంటి నిండా బంగారు పూతతో..

సాధారణంగా సముద్రం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలు, అలలు ఎగసిపడే బీచ్‌లు. కానీ, ప్రపంచంలో ఒక సముద్రం ఉంది. దానికి అసలు తీరమే లేదు. దీనికి ఎటువంటి తీరం కానీ, బీచ్‌లు కానీ లేవు. అదే సర్గస్సో సముద్రం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక ద్వీపంలా కనిపించే ఈ సముద్రం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైనది. భూమి మీద తీరం (Shore) లేని ఏకైక సముద్రం ఇదే కావడం విశేషం. ఈ వింత సముద్రం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. అది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా ఒంటి నిండా బంగారు పూతతో..
Sargasso Sea
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2026 | 4:22 PM

Share

ప్రపంచంలోని అన్ని సముద్రాలకు ఏదో ఒక వైపు భూమి లేదా తీరం ఉంటుంది. కానీ, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న సర్గస్సో సముద్రంకు మాత్రం ఎటువంటి తీరం కానీ, బీచ్‌లు కానీ లేవు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత వింతైన సముద్రంగా పేరుగాంచింది. సర్గస్సో సముద్రానికి భూమితో సంబంధం లేదు. దీనికి ఉత్తరాన ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం, తూర్పున కానరీ ప్రవాహం, దక్షిణాన ఉత్తర అట్లాంటిక్ భూమధ్యరేఖ ప్రవాహం, పశ్చిమాన గల్ఫ్ స్ట్రీమ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రవాహాలు కలిసి ఒక వృత్తాకారంలో తిరుగుతూ (Gyre) ఈ సముద్రాన్ని ఒకే చోట నిలిపి ఉంచుతాయి. సర్గస్సో సముద్రం (Sargasso Sea) గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ సముద్రం ఉపరితలంపై సర్గస్సమ్ అనే బంగారు రంగులో ఉండే సముద్రపు పాచి విపరీతంగా పెరుగుతుంది. ఇది సముద్రంపై ఒక పెద్ద పొరలా పేరుకుపోతుంది. ఈ పాచి అనేక అరుదైన సముద్ర జీవులకు, తాబేళ్లకు, చేపలకు ఆశ్రయం ఇస్తుంది. ఇక్కడ నీరు చాలా స్పష్టంగా, నీలం రంగులో ఉండి చుట్టూ ఉన్న మహాసముద్రం కంటే వెచ్చగా ఉంటుంది. చరిత్రలో నావికులు ఈ సముద్రం గుండా వెళ్లడానికి భయపడేవారు. గాలి తక్కువగా ఉండటం, దట్టమైన పాచి వల్ల ఓడలు ఇక్కడ చిక్కుకుపోయేవి. ప్రాచీన కాలంలో ఇక్కడ ఓడలు నెలల తరబడి నిలిచిపోయి, ఆహారం లేక నావికులు మరణించేవారు. అందుకే దీనిని మృత్యు సముద్రం అని కూడా పిలిచేవారు.

ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం శాస్త్రవేత్తలకు నేటికీ ఒక సవాలే. తీరం లేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సముద్రం, భూమిపై ఉన్న వైవిధ్యానికి ఒక నిదర్శనం. విచిత్రమేమిటంటే ఈ సముద్రం ప్రసిద్ధ బార్ముడా ట్రయాంగిల్‌కు సమీపంలో ఉంటుంది. ఓడలు ఈ దట్టమైన పాచిలో చిక్కుకుంటే ముందుకు కదలడం కష్టమవుతుంది, అందుకే దీనిని నౌకల స్మశానం అని కూడా పిలుస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us