AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశ్విన్ భాయ్ సారీ.. పర్సనల్‌గా మెసేజ్ చేస్తా.. అర్ష్‌దీప్ సింగ్ కామెంట్స్ వైరల్..

క్రికెట్ మైదానంలో స్వింగ్ బాల్స్‌తో వికెట్లు పడేసే అర్ష్‌దీప్ సింగ్.. ఈసారి ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. టీమిండియాలో తనకు నచ్చిన టాప్-5 బౌలర్లను ఎంచుకుంటూనే, ఒక దిగ్గజ స్పిన్నర్‌కు సరదాగా క్షమాపణలు చెప్పాడు. సారీ భాయ్... నీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తా అంటూ అర్ష్‌దీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశ్విన్ భాయ్ సారీ.. పర్సనల్‌గా మెసేజ్ చేస్తా.. అర్ష్‌దీప్ సింగ్ కామెంట్స్ వైరల్..
Arshdeep Singh Apologises To Ashwin
Krishna S
|

Updated on: Aug 04, 2026 | 1:03 PM

Share

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన దృష్టిలో అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురు భారతీయ బౌలర్ల పేర్లను వెల్లడించాడు. కృష్ణాంక్ ఆత్రేయ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అర్ష్‌దీప్.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లను తన టాప్ 5 జాబితాలో చేర్చాడు. అయితే, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును ఈ జాబితాలో ఐదో స్థానంలో చెప్పడంతో సరదాగా ఆయనకు క్షమాపణలు చెప్పాడు. ఆయనకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేస్తానని నవ్వుతూ కామెంట్ చేశాడు.

భువీ భాయ్ నా ఫేవరెట్.. అశ్విన్ భాయ్ సారీ

  • తన బౌలర్ల రేటింగ్స్ గురించి అర్ష్‌దీప్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
  • నా ఫేవరెట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. అందుకే అతనికి మొదటి స్థానం ఇచ్చాను. ఇందులో నా కాస్త పక్షపాతం ఉందనుకున్నా పర్లేదు.
  • రెండో స్థానంలో మహమ్మద్ షమీ ఉంటాడు. ఏ పిచ్ పైనైనా బంతిని సీమ్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ వేయడం ఆయన ప్రత్యేకత.
  • మూడో స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అతనిది చాలా అరుదైన నైపుణ్యం.
  • నాలుగో స్థానంలో నా పంజాబ్ టీమ్‌మేట్ యుజ్వేంద్ర చాహల్ ఉంటాడు. టీ20ల్లో అతని రికార్డులు, తీసిన వికెట్లు అద్భుతం.
  • ఇక అశ్విన్ భాయ్‌ని ఐదో స్థానంలో పెట్టాలని లేదు.. కానీ ఖాళీ స్థానాలు లేకపోవడం వల్ల చివర్లో పెట్టాల్సి వచ్చింది. ఆయన గ్రేట్ బౌలర్ మాత్రమే కాదు, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు తరఫున నాకు మొదటి కెప్టెన్ కూడా. సో.. సారీ అశ్విన్ భాయ్, నీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తానంటూ అర్ష్‌దీప్ సరదాగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం మైదానానికి దూరం

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కీలక బౌలర్‌గా ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. భారత్ ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ఆడనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సిద్దమవుతుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ 1-2తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 72 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. దానికి ముందు జరిగిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో భారత్ ఓడినప్పటికీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు తీసి జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టీ20 సిరీస్‌కు అర్ష్‌దీప్‌కు విశ్రాంతినివ్వగా, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా క్లీన్ స్వీప్ సాధించింది.

Follow Us