AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రో – కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!

Shubman Gill Comments on RO-KHO: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చూపించిన బ్యాటింగ్‌పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. వయసు కారణంగా ఇద్దరి వన్డే భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ.. కీలక ఆటగాళ్లపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు.

రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
Ind Vs Wi Rohit Sharma Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 04, 2026 | 11:19 AM

Share

Shubman Gill Comments on RO-KHO: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుత ఫామ్‌పై గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇద్దరు సీనియర్ బ్యాటర్లపై వస్తున్న విమర్శలకు తన మాటలతో సమాధానం ఇచ్చాడు.

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కోహ్లీ అజేయ సెంచరీ సాధించాడు. రెండో వన్డేలో రోహిత్ శర్మ శతకం బాదాడు. మూడో మ్యాచ్‌లోనూ రోహిత్ సెంచరీకి చేరువగా వెళ్లి 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ప్రదర్శనలను ప్రస్తావిస్తూ గిల్ ఇద్దరి బ్యాటింగ్‌పై సానుకూలంగా స్పందించాడు. కోహ్లీ వయసు 37 ఏళ్లు, రోహిత్ వయసు 39 ఏళ్లు కావడంతో వన్డే భవిష్యత్తుపై చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

ఇవి కూడా చదవండి

మూడో వన్డేలో భారత్ ఓడిన తర్వాత మీడియా సమావేశంలో గిల్ మాట్లాడుతూ.. కోహ్లీ, రోహిత్ సిరీస్‌లో బ్యాటింగ్ చేసిన తీరు తనను ఆకట్టుకుందని తెలిపాడు. ఇద్దరు సీనియర్లు రాణించలేని సందర్భాల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) బాధ్యత తీసుకుని జట్టుకు ఉపయోగపడుతున్నాడని కూడా చెప్పాడు.

వన్డే జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలా? కోహ్లీ, రోహిత్‌కు కొన్ని మ్యాచ్‌లలో విశ్రాంతి కల్పించాలా? అనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై గిల్ మరో స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే మ్యాచ్‌లు పరిమితంగా ఉన్నందున ప్రయోగాలకు ఎక్కువ సమయం లేదన్నది అతడి అభిప్రాయం.

ప్రపంచకప్‌లో ఆడించాలని భావిస్తున్న కాంబినేషన్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని గిల్ పేర్కొన్నాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కోరుకున్న కాంబినేషన్‌ను త్వరగా పరీక్షించుకోవడం ముఖ్యమని చెప్పాడు.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

వెస్టిండీస్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకు తదుపరి వన్డే సిరీస్ న్యూజిలాండ్‌తో ఉంది. ఆ సిరీస్ ప్రారంభానికి సుమారు నెల రోజుల విరామం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం