AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తింటే ఇలాంటి పచ్చడి తినాలి.. దగ్గు, జలుబు, అజీర్ణం ఇట్టే మటుమాయం..

వామాకుతో తయారు చేసే పచ్చడి రుచితో పాటు ప్రత్యేకమైన సువాసనను అందిస్తుంది. పల్లీలు, నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి పదార్థాలతో వామాకు పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేడి అన్నం, టిఫిన్లతో ఈ పచ్చడి మంచి కాంబినేషన్‌గా ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న వామాకు ఆకులతో ఈ రుచికరమైన పచ్చడిని తప్పక ప్రయత్నించండి.

తింటే ఇలాంటి పచ్చడి తినాలి.. దగ్గు, జలుబు, అజీర్ణం ఇట్టే మటుమాయం..
Traditional Chutney
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2026 | 11:06 AM

Share

వామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామాకు పచ్చడి, అలాగే పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. అందుకే.. వామాకు.. తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు వామాకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న వామాకు మొక్కతో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు.. దశలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

వామాకు పచ్చడికి కావలసిన పదార్థాలు:

  • వామాకు: రెండు గుప్పిళ్ళు (సుమారు 20-30 ఆకులు)
  • పల్లీలు: 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు: 1 టీ స్పూన్
  • నువ్వులు: 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు: 1 టీ స్పూన్
  • మినప్పప్పు: 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి: 10-15 (మీ కారానికి తగ్గట్టు)
  • ఆయిల్: 2 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, పోపుకు)
  • చింతపండు: చిన్న ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు: 5-6
  • పసుపు: పావు టీ స్పూన్
  • ఉప్పు: 1 టీ స్పూన్ (లేదా రుచికి సరిపడా)
  • పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు (అర టీ స్పూన్ చొప్పున), చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు (3), కరివేపాకు, ఇంగువ, ఒక ఎండుమిర్చి (ఐచ్ఛికం)

తయారీ విధానం:

వామాకు శుద్ధి: ముందుగా రెండు గుప్పిళ్ళ వామాకును తీసుకుని, ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు కలిపి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వలన ఆకు మీద ఉండే దుమ్ము, మట్టి, ఇసుక వంటివి అడుగున చేరతాయి. తరువాత వామాకును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఒక జాలి గిన్నెలో వేసి నీరు పూర్తిగా పోయే వరకు ఉంచాలి.

పప్పులు వేయించడం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించాలి. అవి కొద్దిగా వేగాక, ఒక టీ స్పూన్ ధనియాలను వేసి కాసేపు ఫ్రై చేయాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసి చిటపటలాడే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టాలి.

పప్పులు, పచ్చిమిర్చి వేయించడం: అదే పాన్ లో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి మాడిపోకుండా లో ఫ్లేమ్ లో దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత, కారానికి తగ్గట్టుగా పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని వేసి రంగు మారే వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చిని, శనగపప్పు, మినప్పప్పులను కూడా నువ్వులు, పల్లీలు వేయించుకున్న ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చిని లేదా రెండింటినీ కలిపి ఉపయోగించవచ్చు.

వామాకు మగ్గించడం: అదే పాన్ లో మిగిలిన నూనెలో శుభ్రం చేసుకున్న వామాకును వేయాలి. స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి, మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి. మూడు నిమిషాల తర్వాత వామాకులో నుంచి నీరు విడుదలై ఉడుకుతుంది. మరో రెండు మూడు నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. సుమారు ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఆకు దగ్గరపడి మగ్గుతుంది. స్టవ్ ఆఫ్ చేసి, ఈ వామాకును పచ్చిమిర్చి వేయించుకున్న ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

అన్నీ చల్లారిన తర్వాత, ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో వేయించిన పప్పులు (పల్లీలు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు) వేయాలి. పావు టీ స్పూన్ పసుపు, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు ముక్క వేసి మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

పచ్చడి గ్రైండింగ్: ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ లోకి వేయించిన పచ్చిమిర్చి, మగ్గించిన వామాకును కలపాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, నీళ్లు కలపకుండా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. వామాకులో ఉండే తేమ పచ్చడి తయారీకి సరిపోతుంది, అదనంగా నీరు కలపాల్సిన అవసరం లేదు.

పోపు: పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక, పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగాక, మూడు చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు, కొద్దిగా ఇంగువ వేసి పోపును బాగా ఫ్రై చేయాలి. కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా చేర్చుకోవచ్చు.

ఈ వేడి పోపును తయారుచేసి పెట్టుకున్న వామాకు పచ్చడిలో వేసి బాగా కలపాలి.

అంతే, నోరూరించే, ఆరోగ్యకరమైన వామాకు పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లలోకి అద్భుతమైన కాంబినేషన్.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని ఆస్వాదించండి..

Follow Us
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు