తోటకూర ఎవరు ఎక్కువగా తినాలో తెలుసా?

samatha

24 october 2026

Pic credit - Pinterest

ఆకు కూరల్లో చాలా మంది ఇష్టంగా తినే కర్రీ ఏదైనా ఉన్నదా అంటే అది తోటకూర. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఆకుకూరలు

తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పోషకాలు పుష్కలం

తోట కూర తినడం వలన రక్తహీనత తగ్గుతుంది. అందువలన ఎవరు అయితే రక్తహీనతతో బాధపడుతున్నారో వారికి ఇది చాల బెస్ట్.

రక్తహీనత

తోటకూరలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. అందువలన ఎవరు అయితే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో, వారు తప్పకుండా తోట కూర తినాలంట.

ఫైబర్

బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర చాలా బెస్ట్ అని చెప్పాలి, ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండటం వలన ఆకలి తగ్గి, కడుపు నిండుగా ఉంటుంది.

బరువు తగ్గడం

ఎముకలు బలహీనంగా ఉన్నవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా తప్పకుండా తోట కూర తినాలి. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ K వల్ల బలం రెట్టింపు అవుతుంది.

ఎముకల బలహీనం

 గుండె జబ్బులు ఉన్నవారికి తోటకూర చాలా మేలు చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం ఇది చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

గుండె జబ్బులు

 తరచూ జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చేవారు ఇమ్యూనిటీ కోసం తోటకూర తింటే చాలా మంచిదని చెప్పాలి. విటమిన్ C తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి