జస్ట్ 5 నిమిషాల్లోనే ఒంటికి చలువ చేసే రుచికరమైన పచ్చడి.. ఆహా అనాల్సిందే..
అలసిపోయినప్పుడు.. ఇంట్లో ఏ కూర లేనప్పుడు.. వంటకు సమయం లేనప్పుడు.. అద్భుతంగా తయారు చేసుకునే రెసిపీల్లో పెరుగు పచ్చడి ఒకటి.. ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే.. అన్నంలోకి కమ్మని రుచిని అందించే ఉల్లి పెరుగు పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రుచికరమైన పచ్చడిని కేవలం 5 నిమిషాల్లో ఎలా చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఏ కాలమైనా శరీరానికి చలువ చేసే, జీర్ణశక్తిని పెంచే ఆహారం చాలా అవసరం. అలాంటి వాటిలో ఉల్లి పెరుగు పచ్చడి ఒకటి.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.. మంచిగా చేసుకుంటే.. అద్భుతంగా అన్నం మొత్తం తినవచ్చు.. కేవలం నిమిషాల వ్యవధిలో తయారు చేసుకోదగిన ఈ రుచికరమైన పెరుగు పచ్చడి తయారీ విధానాన్ని చాలా సులభంగా ఈ కథనంలో తెలుసుకుందాం.. అన్నంలోకి మరేమీ లేకపోయినా, ఈ పచ్చడితో భోజనం తృప్తిగా ఆస్వాదించవచ్చు..
కావలసిన పదార్థాలు:
- పెరుగు: ఒక కప్పు (సుమారు 250 మి.లీ.)
- కాచి చల్లార్చిన పాలు: 1-2 టేబుల్ స్పూన్లు (లేదా అవసరాన్ని బట్టి)
- ఉల్లిపాయలు: 1-2 (చిన్నవి అయితే రెండు, పెద్దది అయితే ఒకటి)
- నూనె: 1 టేబుల్ స్పూన్
- మెంతులు: చిటికెడు
- పోపు దినుసులు (పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర): అర టీ స్పూన్ చొప్పున
- అల్లం ముద్ద: అర టీ స్పూన్ (దంచినది)
- పచ్చిమిరపకాయ: 1 (కట్ చేసినది)
- ఎండుమిరపకాయలు: 2 (ముక్కలుగా చేసినవి)
- కరివేపాకు: కొద్దిగా
- పసుపు: చిటికెడు
- ఉప్పు: రుచికి సరిపడా
- కారం: చిటికెడు (ఐచ్ఛికం)
- ఇంగువ: పావు టీ స్పూన్
- కొత్తిమీర: కొద్దిగా (తరిగినది)
తయారీ విధానం:
పెరుగు సిద్ధం చేయడం: ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. పెరుగు చిక్కదనాన్ని బ్యాలెన్స్ చేయడానికి, నీళ్లకు బదులుగా ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా వేస్తూ, పెరుగును బాగా చిలకాలి. విస్కర్ లేదా మజ్జిగ కవ్వంతో ముద్దలు లేకుండా క్రీమీగా అయ్యేవరకు కలపాలి. ఇలా కలిపిన పెరుగును పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు కోయడం: ఒకటి లేదా రెండు చిన్న ఉల్లిపాయలను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండటానికి చేతితో తేలికగా నలిపితే అవి విడివిడిగా అవుతాయి.
పోపు తయారీ: స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక, చిటికెడు మెంతులను వేసి రంగు మారేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత, అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగాక, దంచిన అర టీ స్పూన్ అల్లం ముద్ద, కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి.
ఉల్లిపాయలు వేయడం: పోపు బాగా వేగాక, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి రెండు నుండి మూడు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా సాఫ్ట్ అయ్యేవరకు ఫ్రై చేయాలి.
మసాలా దినుసులు కలపడం: ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరో చిటికెడు కారం వేసి ఒకసారి బాగా కలపాలి. చివరిగా పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసి మరొక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
పచ్చడి కలపడం: స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, ఈ వేడి పోపు మిశ్రమాన్ని మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న పెరుగులోకి వేయాలి. అలాగే, కొద్దిగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి.
పెరుగు పచ్చడి కన్సిస్టెన్సీ మీకు కావలసిన విధంగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కొంచెం పల్చగా కావాలంటే, మరికొద్దిగా కాచి చల్లార్చిన పాలు లేదా కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
ఇలా అన్ని కలిపితే రుచికరమైన ఉల్లి పెరుగు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నంతో పాటు వేడిగా వడ్డించి ఆస్వాదించవచ్చు. ఇది త్వరగా, సులభంగా చేసుకునే రెసిపీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
